‘బిగ్ బాస్’ రియాలిటీ షో ప్రస్తుతం పదో వారం కొనసాగుతోంది. నామినేషన్లలో ఐదుగురు సభ్యులున్నారు. రవి, మానస్, కాజల్, సన్నీ, సిరి నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఐదుగురు సభ్యుల నుండి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఈ వారం షో నుండి జెస్సీ ఎలిమినేట్ అవుతాడు. అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ అతన్ని సీక్రెట్ రూమ్‌కి పంపి క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదు. నామినేట్ అయిన కంటెస్టెంట్ లకు బదులుగా జెస్సీని ఇంటి నుండి బయటకు పంపాలని బిగ్ బాస్ నిర్ణయించారు.
Read Also : టాలీవుడ్ కు అచ్చిరాని నవంబర్
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నామినేషన్ చివరి రౌండ్‌లో కాజల్, మానస్ మిగిలారు. ఇద్దరి నుండి ఒకరిని బయటకు పంపకుండా జెస్సీ ని ఎలిమినేట్ చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించినట్టు సమాచారం. అనారోగ్య కారణాలతో జెస్సీ ఇంటి నుంచి బయటకు రాగా మిగిలిన ఐదుగురు సేఫ్ గా ఉన్నారు. నిజానికి ఈ వారం కాజల్ బయటకు వెళ్తుందని ప్రచారం జరిగింది. ఈ వారం నామినేషన్ లో ఉన్న ఆమెకు అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చినట్టు సమాచారం. ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్ లో జెస్సి ఎలిమినేషన్ ఉంటుంది.