బిగ్ బాస్ 5 రానురానూ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ కొంతమంది సరదాగా గడుపుతుంటే, మరికొంత మంది ఎమోషనల్ గా ఉన్నారు. అప్పుడే ఈ షో స్టార్ట్ అయ్యి వారం గడిచింది. ఇంటి సభ్యులు లవ్ ట్రాక్స్ ఏర్పాటు చేసుకోవడంలో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. నిన్న నాగార్జున రాకతో ఎపిసోడ్ మొత్తం సందడి సందడిగా సాగింది. సింగర్ శ్రీరామ్ రాముడా ? కృష్ణుడా ?, షణ్ముఖ్ పై నాగ్ ఫన్నీ కామెంట్స్, ‘ఎవరితో సెట్… ఎవరితో కట్’ గేమ్ వంటివి నిన్నటి ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ వీక్ నామినేషనలలో ఆరుగురు సభ్యులు ఉన్న విషయం తెలిసిందే. సరయు, కాజల్, మానస్, రవి, జస్వంత్, హమీద లలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. ఇందులో ఇప్పటికే నాగార్జున ఇద్దరిని సేవ్ చేశారు. యాంకర్ రవి, హమీద సేఫ్ అయ్యారు. ఇంకా నలుగురు ఎలిమినేషన్ కోసం నామినేషన్ లో ఉన్నారు.
Read Also : షణ్ముఖ్ ను ఆటపట్టించిన నాగ్!
అయితే బయట చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు సరయు ఈ రోజు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచీ లీక్స్ కు కొదవ లేదు. కానీ ఈసారి మాత్రం ఎలాంటి లీక్స్ జరగకుండా షో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, కాబట్టి లీక్స్ ఉండవని అన్నారు. కానీ ఈరోజు జరిగే ఎలిమినేష్ గురించి నిన్ననే లీక్ అయ్యింది. మానస్ ప్రేక్షకులకు స్ట్రాంగ్ అనే ఫీలింగ్ తెప్పించాడు. కాబట్టి అతను సేఫ్ కావొచ్చు. కాజల్ కు ఇంతకుముందే ఎంతో కొంత అభిమానులు ఉన్నారు కాబట్టి. ఆమె కూడా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. మిగిలింది ఇద్దరు జశ్వంత్, సరయు. వీరిద్దరూ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అయితే జశ్వంత్ గురించి ప్రేక్షకులకు వాళ్ళ అమ్మ చేసిన ఎమోషనల్ రిక్వెస్ట్ పని చేసి ఉండొచ్చు. ఇక మిగిలింది ఏకే నిరంజన్ సరయు. ఆమె ఇంతకుముందు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే.