షణ్ముఖ్ ను ఆటపట్టించిన నాగ్!

షణ్ముఖ్ జస్వంత్ చూడటానికి కాస్తంత సిగ్గరిగా కనిపిస్తాడు. అతన్ని బిగ్ బాస్ హౌస్ లో చూసిన చాలా మంది గతంలో అతను చేసిన టిక్ టాక్స్, యూట్యూబ్ ఛానెల్ లో పలు వెబ్ సీరిస్ లో చేసిన యాక్టింగ్ చూసి… అతని నుండి ఎంతో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే… మొదటి రెండు రోజులు వారి ఎక్స్ పెక్టేషన్ కు తగ్గట్టుగా షణ్ముఖ్ బిహేవ్ చేయలేదు. చాలా లో-ప్రొఫైల్ ను మెయిన్ టైన్ చేశాడు. అయితే… ఆ తర్వాత రెండు మూడు రోజులు కాస్తంత లైమ్ లైట్ లోకి వచ్చాడు. బహుశా అందుకేనేమో శనివారం షణ్ముఖ్‌ ను నాగార్జున ఓ రేంజ్ లో ఆటపట్టించారు. అందరినీ వదిలేసి… పదే పదే షణ్ముఖ్ నే టార్గెట్ చేశారు. ‘అరే ఎంట్రా ఇది… కాస్త మాట్లాడు’ అంటూ ఒకసారి, ‘ఏంట్రా షణ్ముఖ్’ అని మరోసారి నవ్వుతూ చురకలంటించారు.

Read Also : సింగర్ శ్రీరామచంద్ర… రాముడా? కృష్ణుడా?

ఇదే సమయంలో షణ్ముఖ్‌ లవ్ ఎఫైర్ గురించి ఇంటి సభ్యులూ ఆటపట్టించారు. తాను తెచ్చుకున్న పిల్లో ఉందో లేదో తరచూ చూసుకోవడం షణ్ముఖ్ కు అలవాటని వారు చెప్పగానే… పిల్లో మీద ఏం ఉంటుందని నాగ్ ఆరా తీశారు. అతని గర్ల్ ఫ్రెండ్ పేరు పొడి అక్షరాల్లో రాసి ఉంటుందని అనగానే… ఆమె పేరు చెప్పొచ్చుగా అని నాగ్ కోరారు. వెంటనే షణ్ముఖ్ కాస్తంత సిగ్గుపడుతూ, దీప్తి అని బదులిచ్చాడు. బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ దీప్తి సునయన, షణ్ముఖ్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల వీరు బ్రేకప్ చెప్పుకున్నారనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని, తాను దీప్తితో ఇంకా ఆ రిలేషన్ షిప్ ను కొనసాగిస్తున్నానని షణ్ముఖ్ ఇన్ డైరెక్ట్ గా ప్రకటించేశాడు.

Related Articles

Latest Articles

-Advertisement-