‘బిగ్ బాస్ -5’ ఆసక్తికరంగా మారుతోంది. ఇంటి సభ్యులు కొందరు గ్రూపులుగా మారితే మరికొందరు మాత్రం ఇండిపెండెంట్ గా గేమ్ ఆడుతున్నారు. సిరి, షణ్ముఖ్, జెస్సి ఒక గ్రూప్ కాగా, కాజల్ అందరితోనూ తిరుగుతోంది. మిగతా వారు కూడా అందరితోనూ కలవడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ని రోజులూ యాక్టివ్ గా ఉన్న శ్రీరామ్ హమీద వెళ్ళాక డల్ అయిపోయాడు. సన్నీ, మానస్ క్లోజ్ అయిపోయారు. గత వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావిస్తున్న ప్రేక్షకులకు షాకిస్తూ లోబోను ఎలిమినేట్ చేస్తునట్టు చెప్పి, సీక్రెట్ రూమ్ లో ఉంచాడు. ఇక హౌజ్ మేట్స్ కు షాకిస్తూ శ్వేతను ఎలిమినేట్ చేశారు. ఈ రోజు సోమవారం కాబట్టి ‘బిగ్ బాస్’ హౌజ్ మేట్స్ కు నామినేషన్ డే.
Read Also : ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కోసం గెస్ట్ గా అల్లు అర్జున్
తాజాగా ఈరోజు ‘బిగ్ బాస్ 5’లో నామినేట్ అయినవారి లిస్ట్ బయటకు వచ్చింది. ఈ వారం కూడా తొమ్మిది మంది పోటీదారులు నామినేట్ అయ్యారు. ఆ జాబితాలో సిరి, కాజల్, రవి, శ్రీరామ్ చంద్ర, యాని, ప్రియ, ప్రియాంక, జెస్సీ ఉన్నారు. ఈ వారం గత వారంలా కాకుండా ప్రియా, ప్రియాంక, యాని, సిరి వంటి బలహీనమైన కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉండడం ఆసక్తికరంగా మారింది. విశ్వ, షణ్ముఖ్, మానస్ ఈసారి నామినేషన్ల నుంచి తప్పించుకున్నారు.