స్టార్ రేటింగ్ తో దూసుకుపోతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. తెలుగులో ఏడో సీజన్ జరుపుకుంటుంది.. మొదటి వారం ఎలిమినేషన్ ను పూర్తి చేసుకున్న ఈ షో రెండో వారంలో జనాలకు ఊహించని విధంగా ఎలిమినేషన్ జరగనుంది.. మొదటివారంలో ప్రముఖ నటి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. తెలుగు రాకపోవడం, సరిగా టాస్కుల్లో పాల్గొనకపోవడం, పూర్ ఓటింగ్ ఆమె ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి. మరి ఈ వారం ఎలిమినేట్ అవుతారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ వీక్ నామినేషన్స్‌లో శివాజీ, పల్లవి ప్రశాంత్, రతిక, టేస్టీ తేజా, షకీలా, గౌతమ్ కృష్ణ, శోభాశెట్టి, అమర్‌దీప్, ప్రిన్స్ యావర్.. ఇలా మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీకెండ్ రావడంతో గత రెండు రోజుల నుంచి ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
అలాగే ఓటింగ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.. హౌస్ లో మొదటి నుంచి రైతుబిడ్డ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు..ఈ వారం అతను సేఫ్ అని తెలుస్తోంది. ఇక రెండో స్థానంలో ఉన్న శివాజీ ఉన్నాడని తెలుస్తోంది. మూడో స్థానంలో అమర్ దీప్, రతిక నాలుగో స్థానంలో ఉన్నారని సమాచారం. అయితే ఈ వారం ఎలిమినేషన్ హిట్ లిస్టులో ఉన్న ప్రిన్స్ యావర్‌కు అనూహ్యంగా మద్దతు పెరిగింది.. అతను కూడా ఈ వారం సేఫ్ జోన్ లో ఉన్నట్లే..
ఇదిలా ఉండగా.. ఈ వారానికి సంబందించిన ఓటింగ్ ను చూస్తే..టేస్టీ తేజా, గౌతమ్ కృష్ణ వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. అయితే ఈ సీజన్‌లో టాప్ కంటెస్టెంట్లలో ఒకరైన శోభాశెట్టికి తక్కువగా ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె 8వ స్థానంలో ఉంది. ఇక చివరి స్థానంలో సీనియర్ నటి షకీలా ఉంది. అంటే ప్రస్తుతం శోభాశెట్టి, షకీలా డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక శోభాశెట్టికి ఉన్న క్రేజ్ కారణంగా ఈ వారం ఆమె ఎలిమినేషన్ కాకపోవచ్చని తెలుస్తోంది.. ఈ వారం షకీలా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది.. ఈమె యాక్టివ్‌గా టాస్కులు ఆడడం లేదు. నిజ జీవితంలో ఉన్నట్లుగానే బిగ్‌బాస్‌లోనూ ఎంతో సింపుల్‌గా ఉంటుంది.. ఇక షకీలా వెళ్తుందని సమాచారం.. ఇక ఎవరు వెళ్తారో తెలియాలంటే ఈ వారం బిగ్ బాస్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే..