Puri Stampede: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. గుండిచా ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా.. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారు ప్రేమకాంత మొహంతి, బసంతి సాహూ, ప్రభాతి దాస్ గా అధికారులు గుర్తించారు.
ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఈ యాత్ర ఈరోజు అంటే జూన్ 27న ప్రారంభమవుతుంది. ఈ మహా యాత్ర జూలై 8 వరకు కొనసాగుతుంది. 12 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర పూరి ఆలయం నుంచి గుండిచా ఆలయానికి వారి వారి రథాలపై ఊరేగుతారు. ఈ మహా యాత్ర సందర్భంగా.. జగన్నాథ ఆలయంలో 'ఛేరా…