Varalakshmi Vratam: శ్రీమహా లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం వచ్చేసింది. హిందూ ఆచారం ప్రకారం.. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు. అయితే, శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం ఈ కథను చదివిన, విన్నవారికి సకల కార్యాలూ సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. కాగా, ఈ వ్రతం చేసుకోవాలనుకునే వారు ముందు రోజునే తమ ఇళ్లను పరిశుభ్రంగా కడిగి, వాకిట్లో ముగ్గులు వేసి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, గడపకు పసుపు, కుంకుమతో అలంకరించుకోవాల్సి ఉంటుంది. అయితే, హిందువులకు చెందిన ముత్తైదులు తమ కుటుంబ సౌభాగ్యం కోసం విధిగా ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం వెనుక ఎన్నో పురాణ కథలు ఉన్నాయి.
Read Also: Rahul Gandhi: ఓటర్ల జాబితా చూపించడానికి ఈసీకి ఇబ్బందేంటి?
వరలక్ష్మీ వ్రతం రోజు పాటించే నియమాలు ఇవే..
* వ్రతం చేసే ఇంట్లోని వారు ఆ రోజు మద్యం, మాంసం ముట్టుకోరాదు..
* ఇక, కలశం తీసే ముందు, ఒక ప్లేటులో ఎరుపు రంగు నీరు పోసి, అందులో కర్పూరంతో హారతిని అమ్మవారికి ఇచ్చిన తర్వాత ఆ నీటిని తులసి మొక్కకు మొదట పారబోయాలి. అనంతరం కలశాన్ని తీయాలి.
* వరలక్ష్మీ వ్రతం రోజు సాయంత్రం (సంధ్యాకాలం – సుమారు 5.30 నుంచి 7.00 వరకు) ఇంటి తలుపులు వేయొద్దు. తెరిచే ఉంచాలి..
* ఇంటి గుమ్మాన్ని లక్ష్మిదేవి రూపంగా భావించి, పసుపు, కుంకుమతో మంచిగా అలంకరించుకోవాలి.
* వ్రతం చేసిన వారు మధ్యాహ్నం సమయంలో విస్తరాకులోనే భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవాలి.
* ఇంట్లో ఎవరికైనా మైల ఉంటే, ఆ రోజు అమ్మవారికి నైవేద్యం వండి పెట్టొద్దు.. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టొద్దు.
* వరలక్ష్మీ వ్రతం నాడు ఇంట్లో గొడవలు, కలహాలు పెట్టుకోవద్దు.. ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
* ఇంట్లో ఉపయోగించే నూనెతో ప్రసాదం తయారు చేయొద్దు..
* డబ్బులు/ నోట్ల దండలు అమ్మవారికి వేసేందుకు వీలులేదు.. పుష్పలనే ఉపయోగించాలి..
Read Also: Ball Tampering: ఓవల్ టెస్ట్ లో భారత్ మోసం చేసింది.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
అయితే, ఇంట్లో ఈశాన్యం వైపున రంగవల్లులు వేసి, మండపాన్ని ఏర్పాటు చేసుకుని.. మండపంపై వెండి లేదా కంచు, ఇత్తడి పళ్లాన్ని పెట్టుకుని అందులో బియ్యం పోసి దానిపై వెండి, బంగారం లేదా కంచు, రాగి కలశాన్ని ఉంచాలని వేద పండితులు పేర్కొన్నారు. ఈ కలశంలో కొత్తచిగుళ్లు గల మర్రి లేదా ఇతర మొక్కల చిగుళ్లను మాత్రమే పెట్టాలి. కలశాన్ని గంధం, పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి.. ఈ కలశంపై కొబ్బరికాయను పెట్టి దానిని కొత్త రవికల గుడ్డతో అలంకరణ చేసుకోవడం వల్ల ఆ లక్ష్మీ దేవి కరుణించిన ఈ మీ ఇంట్లో కనక వర్షం కురిసే అవకాశం ఉంటుంది.