Ball Tampering: ఓవల్ టెస్ట్ లో భారత్ మోసం చేసింది.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
- ఇంగ్లాండ్ టెస్టులో భారత్ మోసం చేసింది.
- భారత్ వాజిలిన్‌నుఉపయోగించింది..
- పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ball Tampering: ఇంగ్లాండ్‌తో జరిగిన ఓవల్ టెస్ట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సాధించింది. ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్ చివరి రోజున భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కలిసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను చిత్తుచేశారు. అయితే, ఈ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ తన ట్వీట్ లో.. నా అభిప్రాయం ప్రకారం భారత్ వాజిలిన్‌ను ఉపయోగించింది.. దానితో బంతి 80+ ఓవర్ల తర్వాత కూడా కొత్తగా మెరుస్తుంది. అంపైర్ ఈ బంతిని పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపాలని రాసుకొచ్చాడు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ పోస్ట్ లో షబ్బీర్ అహ్మద్ ఖాన్ ను ఎక్కి పారేస్తున్నారు. ఇందులో కొందరైతే.. మీ వక్ర బుద్ధి మళ్లీ బయట పెట్టారంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.
Exclusive : ‘0’ ఫ్లాప్స్ డైరెక్టర్లు – కానీ రిస్క్ 100%.. ఎందుకంటే?
ఇకపోతే, టెస్ట్ చివరి రోజున విజయం కోసం ఇంగ్లాండ్‌కి 35 పరుగులు అవసరం కాగా, భారత్‌కి 4 వికెట్లు కావాల్సివుంది. అయితే మహ్మద్ సిరాజ్ మ్యాజిక్ స్పెల్‌తో ఇంగ్లాండ్‌ను కుదేలు చేశాడు. అతడు ఆ రోజు 3 వికెట్లు తీసుకోగా, ప్రసిద్ధ్ కృష్ణ మరో కీలక వికెట్ తీశాడు. మొత్తం ఈ టెస్ట్‌లో మహ్మద్ సిరాజ్ 9 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 8 వికెట్లు, ఆకాశ్ దీప్ 2 వికెట్లు సాధించారు. ఈ టెస్ట్ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మొత్తం 5 టెస్ట్‌ల్లో 23 వికెట్లు తీసి, తన కెరీర్‌లో తొలిసారి టెస్ట్ సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్ అయ్యాడు. 5వ టెస్ట్‌లో అందించిన అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.
I think
India used Vaseline
After 80 + over
Ball still shine like new
Umpire should send this ball to lab for examine— Shabbir Ahmed Khan (@ShabbirTestCric) August 4, 2025
తాజావార్తలు
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!