శనివారం వెంకటేశ్వర స్వామిని ఎంతగా కొలుస్తారో అలాగే శనీశ్వరుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు.. ఇక శనివారం శనీశ్వరుడిని ఆరాధిస్తారు. శనివారం నాడు శివుని పూజించాలి. శని దేవుడి చెడు దృష్టిలో చూస్తే.. లేదా మీరు మీ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని, డబ్బు ఖర్చు పెరిగిందని లేదా డబ్బు రాక తగ్గిందని మీరు భావిస్తే, శనివారం నాడు గుడికి వెళ్లి శని దేవుడిని పూజించండి. ఇలా చేయండి. ఈ సమస్యలు తొలగిపోతాయి. శనివారం రోజు శని దేవుడికి నువ్వులను నైవేద్యంగా సమర్పించడం వలన అనేక భాధల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.. శనివారం కొన్ని పనులు చేస్తే శనీశ్వరుడికి కోపం వస్తుందట.. అవేంటో ఒక్కసారి చూద్దాం..
శనివారం రోజున బొగ్గు, ఉప్పు, తోలు, బూట్లు, నల్ల నువ్వులు, మినప పప్పు, చీపురు, నూనె, కలప, ఇనుము లేదా ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదు..
మాంసం, మద్యం సేవించడం చాలా అశుభం. శనీశ్వరుడి దృష్టిలో ఇది అనుచితమైన, పాపపు చర్య. ఇలా చేసే వ్యక్తిని శనీశ్వరుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు.
అలాగే పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకూడదని నమ్ముతారు. దీని వల్ల అత్తమామలతో సంబంధాలు చెడిపోవడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా తెగిపోయే అవకాశం ఉంది..
మాములుగా శనివారం రోజున గోర్లు, జుట్టు కత్తిరించడం మంచిది కాదు.. ఆయనకు కోపం వస్తుంది.. పాలు, పెరుగు తినకూడదని నమ్ముతారు. పాలు తాగాల్సి వస్తే బెల్లం కలుపుకోవాలి.
శనివారం నాడు బెండకాయ, మామిడికాయ పచ్చడి, పండు మిరపకాయలు తినకుండా ఉండాలి..
అలాగే ఈరోజున పొరపాటున కూడా ఎవరిని అవమానించకూడదు.. అదే విధంగా తూర్పు, దక్షిణ, ఈశాన్య వైపు ప్రయాణించకుండా ఉండాలి. ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది… ఈరోజు నల్ల నువ్వులు, ఉలవలు దానం ఇవ్వాలి.. ఇలా చెయ్యడం వల్ల శని భాధల నుంచి విముక్తి కలుగుతుంది..