Koti Deepotsavam 2022: ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా సాగుతోంది. గత నెల 31న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 14వ తేదీ వరకు సాగనుండగా.. అందులో భాగంగా ఆదివారం ఏడో రోజు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.. ఇక, ఇవాళ ఎనిమిదో రోజు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.. కార్తిక మాసం అంటేనే పరమ పవిత్రం.. అందులో కార్తిక సోమవారం అంటే ఎంతో ప్రత్యేకత ఉంది.. అందుకే ఇవాళ భక్తజనం భారీగా తరలివచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి..
Read Also: Koti Deepotsavam Day 7 Highlights : కన్నులపండువగా తిరుమల శ్రీనివాస కల్యాణం
కార్తిక రెండో సోమవారం సందర్భంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కలకలలాడుతున్నాయి.. శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. ఇక, ఇవాళ సాయంత్రం కోటిదీపోత్సవం వేదికగా అద్భుత దృష్యం ఆవిష్కృతం కాబోతోంది.. కోటి దీపోత్సవం కోసం ప్రతి రోజూ ఎన్టీఆర్ స్టేడియం అందంగా ముస్తాబవుతోంది. కోటి దీపోత్సవానికి అవసరమైన అన్ని పూజా సామాగ్రి, పూలు భక్తి టీవీ భక్తులకు ఉచితంగా అందిస్తోంది. కోటి దీపోత్సవానికి వచ్చే భక్తులకు సాదరంగా ఆహ్వానం పలుకుతోంది భక్తి టీవీ..
కోటి దీపోతవ్సంలో 8వ రోజు కార్యక్రమాల విషయానికి వస్తే..
* అనుగ్రహ భాషణం: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీటం, మైసూరు)
* ప్రవచనామృతం: బ్రహ్మశ్రీ పవర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ
* వేదికపై పూజ: మహాదేవునికి కోటి బిల్వార్చన
* భక్తులచే పూజ: శివలింగాలకు కోటి బిల్వార్చన
* కల్యాణం: పంచశైవ క్షేత్రాల కల్యాణాలు
* వాహన సేవ: నంది వాహనం, పల్లకీ సేవ నిర్వహించనున్నారు.. రండి.. తరలి రండి.. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ దీపాల ఉత్సవంలో పాల్గొనండి.. ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులు కండి..