ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం ఏడో రోజుకు చేరింది.. వరుసగా ఆరు రోజుల కోటి దీపోత్సవం వైభవంగా సాగగా.. ఇవాళ ఏడో రోజు కన్నుల పండుగగా నిర్వహించేందుకు రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సన్నద్ధమైంది.. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలివస్తున్నారు. అందరి దేవుళ్లను, అన్ని ఆలయాలను ఒకేచోట చూసే భాగ్యం భక్తులకు కలుగుతోంది.
Read Also: Munugode Bypoll Results Live Updates: మునుగోడు ఫలితాలు లైవ్ అప్‌డేట్స్..
ఇక, ఏడో రోజు జరగనున్న కార్యక్రమాలు
* అనుగ్రహ భాషణంలో భాగంగా శ్రీ జయేంద్రపురి తీర్థ స్వామీజీ (బంగారు రాజరాజేశ్వరి ఆలయం, బెంగళూరు), శ్రీ రాఘవేంద్ర తీర్థ స్వామీజీ (మధ్వమూలసంస్థానం, షిమోగ, కర్ణాటక)
* వేదికపై పూజ: గోవిందనామ స్మరణ, అక్షర్గామ్ 1000 అన్నకూట్
* భక్తులకే పూజ: గోవిందనామస్మరణ
* కల్యాణం: తిరుమల శ్రీనివాస కల్యాణం
* వాహనసేవ: పల్లకి సేవ
కోటి దీపోత్సవం శనివారం 6వ రోజు అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు వేలాదిమంది తరలిరావడంతో ఎన్టీఆర్ స్టేడియం భక్త జనసంద్రంగా మారింది. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది.. ఇక, ఇవాళ 7వ రోజు భక్తి టీవీ కోటిదీపోత్సవం ప్రాంగణానికి తరలివచ్చి.. భాగస్వాములు కండి.. భగవంతుడి కృపకు పాత్రులు కండి.. ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ కుటుంబం భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది… వైకుంఠ చతుర్ధశి శుభవేళ…. విశేష కార్యక్రమాల్లో పాలుపంచుకోండి..