తెలుగు వాళ్లు చేసే ప్రతి పూజకు గణపతిని పెడుతుంటారు.. ఆది దేవుడుగా పూజిస్తారు.. ఆ తర్వాత మెయిన్ పూజను చేస్తారు.. దేవతామూర్తులలో కూడా మొదటి పూజా గణపతికి చేయడం అన్నది ఎప్పటినుంచో వస్తుంది.ఈయనను మొదటగా పూజించడం వల్ల తలపెట్టిన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తారు.. మొదటి పూజ చేయడం వల్ల కష్టాలను తీర్చడంతోపాటు మనం మొదలుపెట్టే పని ఇటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని వేడుకుంటూ స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అయితే విఘ్నేశ్వరుడు ఇంట్లోని వాస్తు దోషాలను కూడా తొలగిస్తాడని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు…
అందుకే చాలా మంది గణపతి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారు.. ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించడం, వ్యాపార స్థలంలో వినాయకుడిని ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.. ఇకపోతే గణపతి పటాన్ని బెడ్ రూమ్ లో పెట్టకూడదు.. ఇక ఇంటి ఈశాన్య దిక్కులో వినాయక విగ్రహం ప్రతిష్టించడం అత్యంత శ్రేయస్కరం. ఇంట్లో ఈశాన్య మూల పూజకు ఉత్తమమైనది. మీరు ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో వినాయకుడిని ఉంచవచ్చు. విగ్రహాన్ని ఉంచేటప్పుడు, ఆయన రెండు పాదాలు నేలను తాకేలా చూసుకోవాలి..
అప్పుడే మనకు అదృష్టం పడుతుంది.. లేకుంటే అరిష్టం.. ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి.. అలాగే ఇంట్లో కేవలం ఒక గణపతి విగ్రహాన్ని మాత్రమే పెట్టి పూజించాలి. పూజా మందిరంలో మూడు వినాయక విగ్రహాలను కలిపి ఉంచవద్దు. తొండం ఎడమవైపునకు తిరిగిన వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. విగ్రహం ఎత్తు పన్నెండు అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు… ఇంట్లో పెట్టే ఏ విగ్రహాలు అయిన పసుపు రంగులో ఉండేలా చూసుకోవాలి..