Mahindra BE 6 Formula E Edition: మహీంద్రా & మహీంద్రా భారత మార్కెట్‌లో BE 6 Formula E ఎడిషన్ ను విడుదల చేసి మరోసారి ఆటోమొబైల్ రంగం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే మొదటి Formula E-థీమ్‌డ్ ఎలక్ట్రిక్ SUVగా ఈ మోడల్ ప్రత్యేక గుర్తింపు అందుకుంది. భారతదేశంలో మోటార్‌స్పోర్ట్స్ పట్ల యువతతో పాటు కుటుంబాల్లో కూడా వృద్ధి చెందుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని, Formula E Championship స్టైలింగ్‌ను రోడ్డు వాహనంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఎడిషన్ రూపొందించబడింది.
BE 6 Formula E Edition బయట డిజైన్ పూర్తిగా మోటార్‌స్పోర్ట్ లుక్ కనపడుతుంది. సిగ్నేచర్ బంపర్, సర్కులర్ ప్రోజెక్టర్ హెడ్ లాంప్స్, గ్లోస్ బ్లాక్ బెజెల్స్, ఫైర్ స్టార్మ్ ఆరంజ్ హైలైట్స్ ఈ SUV కి మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. ఎవరెస్ట్ వైట్, ఫైర్ స్టోర్మ్ ఆరంజ్, టాంగో రెడ్, స్టీల్త్ బ్లాక్ అనే నాలుగు ఎక్స్‌టీరియర్ రంగులు అందుబాటులో ఉన్నాయి. రేస్‌ట్రాక్ స్టైల్ అల్లాయ్ వీల్స్, ఫైర్ స్టోర్మ్ ఆరంజ్ బ్రేక్ కాలిపర్లు, రూఫ్ & బూట్ స్పాయిలర్లు, ఫార్ములా ఈ డీకల్స్, FIA బ్రాండింగ్, గ్లాస్ రూఫ్/బోనెట్‌పై 12-స్ట్రైప్ గ్రాఫిక్స్ మోడల్‌కు ప్రత్యేక ఆకర్షణగా కనపడుతున్నాయి.
ఇక ఇంటీరియర్ భాగాల్లో కూడా Formula E థీమ్‌ను కొనసాగించారు. ఫైర్ స్టోర్మ్ ఆరంజ్ టచ్‌లతో కూడిన ప్రీమియం క్యాబిన్ అందించబడింది. డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్రాంతం వంటి భాగాల్లో కలర్ థీమ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫార్ములా ఈ లోగోలతో డిజైన్ చేసిన సీట్లు, FIA బ్రాండెడ్ సీట్‌బెల్ట్స్, ప్రత్యేక ఎడిషన్ ప్లాక్, ట్రాన్స్‌లుసెంట్ డోర్ ఇన్‌సర్ట్స్, రేస్ కార్ స్టైల్ స్టార్ట్/స్టాప్ బటన్ ఫ్లాప్, కస్టమ్ స్టార్ట్‌అప్ యానిమేషన్ వంటి ఫీచర్లు క్యాబిన్‌ను మరింత స్పోర్టీగా మారుస్తాయి.
పర్ఫార్మెన్స్ పరంగా రెండింటిలోను 79kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన 210kW మోటార్ ఉంది. ఈ SUV 0-100 కిమీ వేగాన్ని కేవలం 6.7 సెకన్లలో చేరుతుంది. ఇక దీనికి 180kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల 20% నుంచి 80% వరకు ఛార్జింగ్‌కు 20 నిమిషాలే పడుతుంది. iLink ఫ్రంట్ సస్పెన్షన్, 5-లింక్ రియర్ సెటప్, ఫ్రీక్వెన్సీ-డిపెండెంట్ డ్యాంపింగ్ వంటి ప్రీమియం సస్పెన్షన్ ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
స్మార్ట్ ఫీచర్ల పరంగా ఈ ఎడిషన్ అత్యాధునిక టెక్నాలజీతో లాంచ్ అయ్యింది. డ్యుయల్ 12.3 ఇంచ్ డిస్‌ప్లేలు, Snapdragon 8155 చిప్‌సెట్, వైర్లెస్ Android Auto & Apple CarPlay, Harman/Kardon 16-స్పీకర్ సిస్టమ్ (Dolby Atmos), బిల్ట్-ఇన్ Alexa, OTT అండ్ సోషల్ మీడియా యాప్స్, 5G సపోర్ట్, Me4U కనెక్టెడ్ స్యూట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, 360° కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, బ్రేక్-బై-వైర్, ఎలక్ట్రానిక్ బ్రేక్ బూస్టర్, డ్రైవర్ డ్రౌసినెస్ డిటెక్షన్, TPMS వంటి ఫీచర్లు అందించబడ్డాయి.
TV Offer: వర్త్ వర్మ వర్త్.. TCL 55 అంగుళాల టీవీపై ఏకంగా రూ.48000 డిస్కౌంట్..!
మొదటి 999 కస్టమర్ల కోసం మహీంద్రా ప్రత్యేక బహుమతులు కూడా అందిస్తోంది. రేసర్ కుశ్ మైనీతో ప్రత్యేక ట్రాక్-డే అనుభవం, మెమొరబిలియా కలిగిన కలెక్టర్ బాక్స్, 0–99 మధ్య ప్రత్యేక డీకల్ నంబర్ ఎంపిక చేసే అవకాశం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాక ఈ 999 మంది కస్టమర్ల పేర్లు లండన్ E-Prixలో పోటీ చేసే మహీంద్రా రేసింగ్ కార్‌పై ప్రదర్శించబడతాయి. అలాగే ముగ్గురు కస్టమర్లకు పూర్తి ఖర్చులు మహీంద్రానే భరిస్తూ లండన్ E-Prix ప్రత్యక్ష అనుభవం ఇవ్వబడుతుంది. ఇక ధర విషయానికి వస్తే.. FE2 రూ. 23.69 లక్షలు (ex-showroom), అదనపు సౌకర్యాలతో కూడిన FE3 ధర రూ. 24.49 లక్షలు (ex-showroom) గా నిర్ణయించారు. కారు బుకింగ్స్ జనవరి 14, 2026 నుండి ప్రారంభమవుతాయి. కాగా, డెలివరీలు ఫిబ్రవరి 14, 2026 నుండి అందుబాటులో ఉంటాయి.
Inspired by the Circuit. Built for the City. The BE 6 Formula E edition, launching at a price of ₹23.69 Lakh.#BE6FormulaE #SpecialEdition #MahindraElectricOriginSUVs #MahindraRacing pic.twitter.com/w8oN2riXW0
— Mahindra Electric Origin SUVs (@mahindraesuvs) November 26, 2025