TV Offer: స్మార్ట్ TV కొనాలని చూస్తున్నవారికి అమెజాన్‌లో మరో భారీ ఆఫర్ లభిస్తోంది. TCL కంపెనీకి చెందిన 139 సెం.మీ (55 అంగుళాల) 4K అల్ట్రా HD గూగుల్ TV TCL 55V6C మోడల్ ప్రస్తుతం రికార్డు స్థాయి తగ్గింపుతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 77,990 ఉన్న ఈ ప్రీమియం 4K TV ప్రస్తుతం అమెజాన్‌లో 62% డిస్కౌంట్‌తో కేవలం రూ. 29,990కే లభిస్తోంది. అంటే ఈ టీవీపై ఏకంగా రూ.48000 డిస్కౌంట్ తో లభిస్తుందన్నమాట. గత నెలలోనే 200 కంటే ఎక్కువ టీవీలు అమ్ముడవడం కూడా ఈ టీవీపై ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తుంది.
ఈ TCL 55V6C మోడల్ తక్కువ ధరలో లభిస్తున్నప్పటికీ.. ఫీచర్ల విషయానికి వస్తే హై-ఎండ్ స్మార్ట్ టీవీలకు ఏమాత్రం తగ్గదు. 55 ఇంచుల 4K UHD LED ప్యానెల్‌తో కూడిన ఈ TVలో HDR10 సపోర్ట్, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్, అలాగే AiPQ ప్రాసెసర్ వంటి ఆధునిక సాంకేతికతలు ఉన్నాయి. 100% కలర్ వాల్యూం ప్లస్ టెక్నాలజీ, బెజెల్-లెస్ మెటాలిక్ అల్ట్రా స్లిమ్ డిజైన్ కారణంగా విజువల్ ఎక్స్‌పీరియన్స్ మరింత రిచ్‌గా ఉంటుంది. MEMC సపోర్ట్ ఉండటంతో యాక్షన్ సీన్స్ కూడా స్మూత్‌గా కనపడతాయి.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట..
ఆడియో విషయంలో ఈ TV డాల్బీ ఆట్మాస్ మరియు DTS-X సపోర్ట్‌తో వస్తోంది. 24W స్పీకర్లు రూమ్ ఫిలింగ్ ఆడియోని అందిస్తాయి. ఇక పనితీరుకు వస్తే 2GB RAM, 16GB స్టోరేజ్, 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల మొత్తం యూజర్ అనుభవం చాలా ఫాస్ట్‌గా, స్మూత్‌గా ఉంటుంది. ఇక స్మార్ట్ ఫీచర్లలో గూగుల్ టీవీ OS, నెట్ఫ్లిక్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, Zee5 వంటి యాప్స్ ముందే ఇన్‌స్టాల్డ్‌గా లభిస్తాయి. గూగుల్ అసిస్టెంట్, స్క్రీన్ మిరరింగ్, వెబ్ బ్రౌజర్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ కోసం HDMI, USB, Wi-Fi 5, ఇథర్నెట్, బ్లూటూత్ వంటి అన్ని అవసరమైన ఆప్షన్లు ఉన్నాయి. స్మార్ట్ రిమోట్‌తో పాటుగా డెడికేటెడ్ హాట్‌కీలు కూడా ఇవ్వడం వల్ల యూజ్ మరింత సులభం అవుతుంది.
