Raju Weds Ramabhai Free Shows: మహిళలకు గుడ్ న్యూస్.. ‘రాజు వెడ్స్ రాంభాయ్’ ఫ్రీ షోలు.. థియేటర్ల లిస్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raju Weds Ramabhai Free Shows: ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్‌లో ఎక్కడ చూసిన రాజు వెడ్స్ రాంభాయ్ సినిమా చర్చే జరుగుతుంది. చిన్న సినిమాగా విడుదలై ‘రూరల్ కల్ట్ బ్లాక్‌బస్టర్’గా దూసుకుపోతున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంభాయ్’. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం, ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు సాయిలు కంపటి దర్శకత్వం వహించగా, వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. దీనికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని మరింత మంది ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళలకు చేరువ చేసేందుకు ఈ సినిమా యూనిట్ ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.
READ ALSO: Telangana : సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అమలు చేసి తీరుతుందా?
Also Read
“మా రాంభాయ్ కథ.. ప్రతి మహిళ కోసం!!” అనే నినాదంతో, ఆంధ్రా, సీడెడ్ (Rayalaseema) ప్రాంతాల్లోని ఎంపిక చేసిన ప్రధాన థియేటర్లలో మహిళలకు ఉచిత స్క్రీనింగ్ ఏర్పాటు చేసినట్లు ఈ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాను ఉచితంగా చూడాలనుకునే మహిళా ప్రేక్షకులు నేరుగా కింద ఇచ్చిన జాబితాలో ఉన్న థియేటర్ల దగ్గరకు వెళ్లి, అక్కడ ఉచితంగా టికెట్లు తీసుకొని సినిమాను ఆస్వాదించవచ్చని చెప్పారు.
ఉచిత ప్రదర్శనలు ఉన్న థియేటర్ల జాబితా (ఆంధ్రా & సీడెడ్):
విశాఖపట్నం: శ్రీ కన్య, జగదాంబ
విజయనగరం: కృష్ణ
శ్రీకాకుళం: సూర్య మహల్
రాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్
కాకినాడ: పద్మ ప్రియ కాంప్లెక్స్
ఏలూరు: అంబికా కాంప్లెక్స్
తణుకు: శ్రీ వెంకటేశ్వర
విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్
మచిలీపట్నం: సిరి కృష్ణ
గుంటూరు: బాలీవుడ్
ఒంగోలు: గోపి
నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్
కావలి: లత (2 షోలు), మానస (2 షోలు)
చిత్తూరు: గురునాథ్
తిరుపతి: జయ శ్యామ్
నంద్యాల: నిధి
కర్నూలు: ఆనంద్
కడప: రవి
రాయచోటి: సాయి
అనంతపురం: SV సినీ మాక్స్
హిందూపురం: గురునాథ్

READ ALSO: RSV virus Symptoms: జలుబు తీవ్రత పెరిగితే ఈ ప్రమాదం వస్తుంది..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!