KTM X-Bow Arrow: KTM నుంచి కొత్త ఆఫ్‌రోడ్ వాహనం.. 500 యూనిట్లే, ధర రూ.92.4 లక్షలు
- కేటీఎం నుంచి కొత్త టూ-సీటర్ ఆఫ్‌రోడ్ UTV X-Bow Arrow
- వోక్స్వ్యాగన్ గ్రూప్‌కు చెందిన 2.0 లీటర్ EA888 టర్బో పెట్రోల్ ఇంజిన్
- కొండలు, ఇసుక ఏ పరిస్థితుల్లో అయినా ప్రయాణం సాగించే సత్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTM X-Bow Arrow: ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ కంపెనీ కేటీఎం (KTM), ఇప్పుడు మరో కొత్త వాహనంతో ఆఫ్‌రోడ్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. తన కొత్త టూ-సీటర్ యుటిలిటీ టెర్రైన్ వెహికల్ (UTV) KTM X-Bow Arrowను విడుదల చేసింది. వోక్స్‌వ్యాగన్‌కు చెందిన 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రూపొందించిన ఈ వాహనం కఠినమైన భూభాగ పరిస్థితుల్లో సమర్థవంతగా ప్రయాణించేలా రూపొందించారు. దీని బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ ఏకంగా 330 HP పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. నవంబర్ 17 నుంచి దీని బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
డాకర్ ర్యాలీ అనుభవంతో ఈ కొత్త వాహనాన్ని డెవలప్ చేశారు. శక్తివంతమైన బైకులకు ప్రసిద్ధి చెందిన కేటీఎం ఇప్పుడు ఈ ఆఫ్ రోడ్ వెహికిల్‌ను పరిచయం చేసింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు పక్కపక్కన కూర్చునే సదుపాయం ఉంటుంది. డాకర్ ర్యాలీలో పాల్గొన్న డ్రైవర్ల అనుభవాలతో ఈ వాహనాన్ని రూపొందించారు.
Also Read
- TVS Callisto 110: టీవీఎస్ Callisto 110 స్కూటర్ లాంచ్.. 33 లీటర్ల స్టోరేజ్, బ్లూటూత్, నావిగేషన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
- Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..
- Traffic Rules: పాత బైక్‌లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
- రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
KTM X-Bow Arrow తొలుత బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ రూపంలో విడుదల కానుంది. ఈ ప్రత్యేక వెర్షన్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లను మాత్రమే తయారు చేయనున్నారు. బ్లాక్ ఎడిషన్ ధర సుమారుగా 98,600 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.92.4 లక్షలు) కాగా, స్టాండర్డ్ మోడల్ ధర 59,800 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.56.04 లక్షలు)గా ఉంటుందని అంచనా. నవంబర్ 17, 2026 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. వాహనం డెలివరీలు 2027 చివరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
డిజైల్ ఎలా ఉంది..?
KTM X-Bow Arrow పొడవు 3,700 మిల్లీమీటర్లు, వెడల్పు 1,950 మిల్లీమీటర్లు, ఎత్తు 1,800 మిల్లీమీటర్లు. దీని వీల్‌బేస్ 2,900 మిల్లీమీటర్లు. దీని ముందు దీర్ఘచతురస్రాకారంలో గ్రిల్, స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి. ఇది కఠినమైన దారుల్లో ప్రయాణించేటప్పుడు ఉపయోగపడుతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 430 మిల్లీమీటర్ల, 15 అంగుళాల చక్రాలు ఉంటాయి.
దీని క్యాబిన్లో సాబెల్ట్ సీట్లు, హర్నెస్ సిస్టమ్ ఉన్నాయి.డాష్‌బోర్డ్‌లో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో పాటు 10 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ అందించారు. బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్‌లో ఎయిర్ కండిషనింగ్, హైడ్రాలిక్ ఫ్లై-ఆఫ్ హ్యాండ్‌బ్రేక్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ర్యాలీ, మోటార్‌స్పోర్ట్ డ్రైవింగ్‌కు ఉపయోగపడతాయి.
ఆఫ్ రోడింగ్ కోసం ప్రత్యేకమైన ఛాసిస్, సస్పెన్షన్‌లో దీనికి అమర్చారు. క్రోమ్-మోలీ స్టీల్ ఛాసిస్‌ను ఉపయోగించారు. స్టాండర్డ్ వెర్షన్లో దీని ఇంజన్ 80 HP పవర్‌ను అందిస్తే, బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ 330 HP శక్తిని అందిస్తుంది. ద
తాజావార్తలు
-
KTM X-Bow Arrow: KTM నుంచి కొత్త ఆఫ్‌రోడ్ వాహనం.. 500 యూనిట్లే, ధర రూ.92.4 లక్షలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
-
Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
-
North Korea: అమెరికా దెబ్బకు వణికిపోతున్న కిమ్.. 54 ఏళ్ల తర్వాత రాజ్యాంగం మార్చి సంచలన నిర్ణయం!
-
UP Elections: యూపీలో ఒవైసీ-చంద్రశేఖర్ పొత్తు.. బీజేపీ హ్యాపీ, అఖిలేష్లో టెన్షన్.!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!