Tata Motors lowers Nexon EV prices, increases range: నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించింది టాటా. దీంతో నెక్సాన్ మ్యాక్స్ వేరియంట్ పరిధిని పెంచింది. మహీంద్రా ఎక్స్‌యూవీ400 మార్కెట్లో లోకి విడుదలైన నేపథ్యంలో టాటా తన నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించింది. టాటా నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించింది. ఇందులో నెక్సా ఈవీ ప్రైమ్, నెక్సాన్ ఈవీ మాక్స్ ఉన్నాయి. గతంలో నెక్సాన్ ఈవీ ధర రూ. 14.99 లక్షల నుంచి రూ. 19.34 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండగా.. ఇప్పుడు రూ. 14.49 లక్షల నుంచి రూ.18.99 లక్షల(ఎక్స్-షోరూమ్)కు తగ్గించింది. కంపెనీ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ రేంజ్ ను 437 కిలోమీటర్ల నుంచి 453 కిలోమీటర్లకు పెంచింది.
ఇండియన్ మార్కెట్ లోకి మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. రూ.15.99 లక్షల నుంచి రూ. 18.99లక్షల(ఎక్స్-షోరూం) ధరకు లభిస్తున్న ఎక్స్‌యూవీ400, 456 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని మహీంద్రా కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఇది నెక్సాన్ ఈవీ కన్నా 3 కిలోమీటర్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ జనవరి 25, 2023 నుంచి నెక్సాన్ ఈవీ మాక్స్ వేరియంట్ రేంజ్ ను 453 కిలోమీటర్లకు పెంచనుంది. ఫిబ్రవరి 15, 2023 నుంచి డీలర్‌షిప్‌ల వద్ద సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ప్రస్తుత నెక్సాన్ ఈవీ మాక్స్ వినియోగదారులు ఈ రేంజ్ ను పొందవచ్చు.
Read Also: Social Look: పొట్టి నిక్కర్ లో రష్మిక.. అలా వెనక్కి తిరిగి చూసిన వరుణ్ తేజ్
నెక్సాన్ ఈవీ ప్రైమ్ 30.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి 129 పీఎస్ శక్తితో 243 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. నెక్సాన్ ఈవీ మాక్స్ 40.5kWh బ్యాటరీ ప్యాక్ తో 143 పీఎస్ శక్తిన, 250ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది. నెక్సాన్ ఈవీ ప్రైమ్ ఒక్క ఫుల్ ఛార్జ్ తో 312 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ లో IP67-రేటెడ్ వెదర్ ప్రూఫ్ మరియు డస్ట్ ప్రూఫ్ బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోటారుకు ఎనిమిదేళ్లు లేదా 1,60,000కిమీల వారంటీ ఇస్తుంది.
ఇక టాటా మోటార్స్ కొత్తగా నెక్సాన్ ఈవీ మాక్స్ ఎక్స్ఎం ను తీసుకువచ్చింది. దీని ధర రూ. 16.49 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఉండనుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ తో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పుష్-బటన్ స్టార్ట్, డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీతో ZConnect కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు రియర్ డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కొత్త వేరియంట్ Nexon EV MAX XM డెలవరీలను ఏప్రిల్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
వేరియంట్ వారీగా టాటా నెక్సాన్ EV ధరలు (ఎక్స్-షోరూమ్):
నెక్సాన్ ఈవీ పైమ్- 30.2kWh బ్యాటరీ ప్యాక్/3.3kW ఛార్జర్:
XM – రూ. 14.49 లక్షలు
XZ+ – రూ. 15.99 లక్షలు
XZ+ లగ్జరీ – రూ. 16.99 లక్షలు
నెక్సాన్ ఈవీ మ్యాక్స్- 40.5kWh బ్యాటరీ ప్యాక్/3.3kW ఛార్జర్:
XM – రూ. 16.49 లక్షలు
XZ+ – రూ. 17.49 లక్షలు
XZ+ లగ్జరీ – రూ. 18.49 లక్షలు
నెక్సాన్ ఈవీ మ్యాక్స్- 40.5kWh బ్యాటరీ ప్యాక్/ 7.2kW ఛార్జర్:
XM – రూ. 16.99 లక్షలు
XZ+ – రూ. 17.99 లక్షలు
XZ+ లగ్జరీ – రూ. 18.99 లక్షలు