చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ‘ఊయల జంపాల’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి హిట్ అందుకుంది. తర్వాత వరుస చిత్రాలు చేసినప్పటికి అనుకున్నంతగా హిట్‌లు మాత్రం పడలేదు. కానీ ప్రజంట్ బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇన పోతే తాజాగా ఈ అమ్మడు తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు చెక్ పెట్టింది.
Also Read : Tourist Family : ఆస్కార్ రేసులో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’.. గర్వపడుతున్న సౌత్ సినిమా!
అవికా గోర్ 2025 జూన్‌లో తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చాంద్వానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఒక పార్టీలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు వెళ్లింది. ఇటీవల ‘పతి పత్నీ ఔర్ పంగా’ అనే షోలో వీరిద్దరూ కలిసి కనిపించి సందడి చేశారు. ఇక పెళ్లయిన కొద్ది రోజులకే ప్రెగ్నెన్సీ వార్తలు రావడంతో అవికా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.. ‘గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నేను గర్భవతినంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి అబద్ధపు వార్తలను నమ్మవద్దు, ఇవన్నీ కేవలం తప్పుడు వార్తలే’అని అవికా ఘాటుగా స్పందించింది. అయితే,
ఇదే సమయంలో అభిమానులకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ వార్తలు ఫేక్ అయినప్పటికీ, తన జీవితంలో మరో ‘గుడ్ న్యూస్’ ఉందని, అది ఏంటో త్వరలోనే వెల్లడిస్తానని చెప్పి అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. మరి ఆమె చెప్పబోయే ఆ కొత్త గుడ్ న్యూస్ ఏదైనా సినిమా ప్రాజెక్టు గురించా లేదా వ్యక్తిగత విషయమా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.