Pure EV : వచ్చే ఐదేళ్లలో ప్యూర్ ఈవీ పెను సంచలనం.. 2 వేల కోట్ల టర్నోవరే టార్గెట్!
- వచ్చే ఐదేళ్లల్లో ప్యూర్ ఈవీ మోటార్ సైకిల్స్ పెను సంచలనం
- భారత్ ద్విచక్ర వాహనాల విక్రయాల్లో 65% వాటా ప్యూర్ ఈవీ మోటార్‌సైకిళ్లదే
- రూ. 2వేల కోట్ల టర్నోవరే టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pure EV Aims To Become India’s Second Listed EV Manufacturer Targets IPO Next Year: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం (2W) విభాగంలో అగ్రగామి బ్రాండ్ అయిన ప్యూర్ ఈవీ 2025లో గణనీయమైన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ని ప్రారంభించేందుకు ప్రణాళికలను ప్రకటించింది. దాని అద్భుతమైన వృద్ధి ప్రగతిపథంలో కొనసాగుతోందనే చెప్పాలి. నాట్కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్, లారస్ ల్యాబ్స్ ఫ్యామిలీ ఆఫీస్, హెచ్ టీ వెంచర్స్, బీసీసీఎల్, యూఈపీఎల్, ఐ-టీఐసీ, ఐఐటీ హైదరాబాద్‌తో సహా ప్రముఖ పెట్టుబడిదారుల మద్దతుతో కంపెనీ బలమైన పెట్టుబడిదారుల పూర్తి నమ్మకాన్ని సంపాదించిందని చెప్పొచ్చు. నిజానికి ప్యూర్ ఈవీ స్థిరంగా మంచి ఆర్థిక మూలాలను కలిగి వుంది ఎందుకంటే కంపెనీ గత మూడేళ్లుగా నిర్వహణ లాభాలను సాధించింది. FAME సబ్సిడీలపై ఆధారపడకుండా నగదు చెల్లింపులను సజావుగా నిర్వహించింది. 85% వాటాను కలిగి ఉన్న కంపెనీ ప్రమోటర్లు, ఆపరేటింగ్ స్థాయిలో స్థిరంగా లాభాలను పొందుతున్నారు.
అంతర్గత బ్యాటరీ తయారీ, దాని పవర్‌ట్రెయిన్, సాఫ్ట్‌వేర్ యొక్క బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్‌తో, ప్యూర్ ఈవీ 120 మేధోపరమైన లక్షణాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. సరైన నగదు చెల్లింపులతో ఆర్గానిక్ విక్రయాలను నడుపుతూ ప్రభుత్వ రాయితీలు లేకుండానే కంపెనీ మూడేళ్ల నిర్వహణ లాభాలను సాధించింది. ఇటీవల, ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లలో 100 ఎక్స్ వృద్ధికి సిద్ధంగా ఉన్న సెగ్మెంట్‌లో నం. 2 స్థానాన్ని దక్కించుకోనుంది. రాబోయే నాలుగేళ్లల్లో 20 ఎక్స్ టర్నోవర్ వృద్ధి అంచనాలతో, ప్యూర్ ఈవీ మాస్ కమ్యూట్ మార్కెట్లో వ్యూహాత్మకంగా స్థానం సంపాదించింది. ఐఐటీ హైదరాబాద్‌తో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యం, యూకే లోని కోవెంట్రీ నుండి ఇంజినీరింగ్ సంస్థ పీడీఎస్ఎల్ తో FY26లో సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించి రాబోయే రోజుల్లో మరిన్ని అద్బుతమైన ఆవిష్కరణలు చేయబోతున్నాం అని సంస్థ ప్రకటిచింది.
Also Read
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్!
2025 భారత్ ఎలక్ట్రానిక్ విప్లవంలో భాగస్వామ్యం కావడం తమకెంతో ఆనందంగా ఉందని ప్యూర్ ఈవీ సీఈవో రోహిత్ వదేరా అన్నారు. నూతన ఆవిష్కరణలు, నైపుణ్యం, స్థిరత్వం పట్ల తమ నిబద్ధత ప్యూర్ ఈవీని అగ్రగామిగా నిలిపిందని తెలిపారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ రవాణా యొక్క భవిష్యత్తు, ప్యూర్ ఈవీనేనని తాము విశ్వసిస్తున్నామన్నారు. తమ వినూత్న A I ఆధారిత సాంకేతికత, పనితీరు, సామర్థ్యంపై దృష్టి సారించడంతో మోటార్‌సైకిల్ విభాగంలో గణనీయమైన వాటాను పొందేందుకు తమకు అనుమతి లభిస్తుందన్నారు. ప్రతిభావంతులైన బృందం, పెట్టుబడిదారుల మద్దతుతో, తాము కేవలం వాహనాలను విక్రయించడం లేదని, తాము తమ కమ్యూనిటీలకు, ఈ సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ప్రస్తుతం ప్యూర్ ఈవీ, EV విభాగంలో ప్రాంతీయ రవాణా కార్యాలయం స్థాయిలో సుమారు 7% మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు. భారతదేశం అంతటా టైర్ 1, టైర్ 2 నగరాల్లో దాని పరిధిని భారీగా విస్తరించాలనే ఆశయంతో ఉందని తెలిపారు. కంపెనీ ఇటీవల ప్రారంభించిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో వృద్ధి చెందుతున్న మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇది రాబోయే ఐదేళ్లలో 100 రెట్లు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు. భారతదేశంలో విక్రయించే ద్వి చక్ర వాహనాలలో 65% వాటా ప్యూర్ ఈవీ మోటార్‌సైకిళ్లదేనన్నారు.
ఇక సాంకేతికత అభివృద్ధి చెందడం, బ్యాటరీ ధరలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నందున, ప్యూర్ ఈవీ ఈ ట్రెండ్లను ప్రభావితం చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందన్నారు. కంపెనీ యొక్క వినూత్న ఆఫర్లు, దూకుడు మార్కెటింగ్, బ్రాండింగ్ వ్యూహంతో కలిపి, దాని డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల అమ్మకాలను వేగవంతం చేస్తామన్నారు. రాబోయే నాలుగేళ్లల్లో ప్యూర్ఈవీ 2000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. టర్నోవర్ పెరగడం వల్ల లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..