Oben Rorr EZ Sigma: ఇండియన్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లో మరో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చేసింది Oben Electric. కొత్తగా Oben Rorr EZ Sigma పేరుతో నెక్స్ట్-జెన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. Oben Rorr EZ Sigma బైక్ డిజైన్, రేంజ్, స్మార్ట్ ఫీచర్ల పరంగా మార్కెట్‌లో పోటీని ఎదురుకొనేలా రంగం సిద్ధం చేసింది. పెద్ద బ్యాటరీ, మంచి మోటార్, డిజిటల్ ఫీచర్లతో యువతను ఆకట్టుకునేలా ఉంది. పవర్, స్టైల్, టెక్నాలజీ అన్నింటినీ కలిసి ఉన్న ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్, దేశీయ మార్కెట్‌లో సంచనాలు సృష్టించడానికి సిద్ధమైంది.
ఈ కొత్త Oben Rorr EZ Sigmaలో డిజైన్ అప్‌గ్రేడ్ అండ్ కొత్త కలర్స్ విషయాలకు వస్తే.. ఇందులో రీడిజైన్ చేసిన సీట్‌తో పాటు, బైక్ బాడీ చుట్టూ పదునైన ఎడ్జ్ లను కలిగి ఉంది. దీని వల్ల సుదూర ప్రయాణాల్లో మెరుగైన కంఫర్ట్ లభిస్తుంది. ముందుగా ఉన్న రౌండ్ హెడ్‌ల్యాంప్ అలాగే కొనసాగుతుంది. డిజైన్ పరంగా కొత్త ఎలక్ట్రిక్ రెడ్, అలాగే ఫోటాన్ వైట్, ఎలక్ట్రో అంబర్, సర్జ్ సియన్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ కొత్త బైక్‌లో ఇప్పుడు 5-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే లభిస్తుంది. ఇది బైక్ అపరేషన్స్‌ను మరింత సులభంగా చేస్తుంది. ఇది ఇన్‌బిల్ట్ నావిగేషన్, ట్రిప్ మీటర్, రియల్‌టైమ్ కాల్స్, మెసేజ్, మ్యూజిక్ అలర్ట్స్ వంటి ఫీచర్లతో లభించనుంది.

అలాగే, Oben Electric మొబైల్ యాప్ ద్వారా యూజర్లు GPS, జియో ఫెన్సింగ్, స్మార్ట్ అలర్ట్స్, చార్జింగ్ స్టేషన్లను గుర్తించటం, రిమోట్ డయాగ్నోస్టిక్స్ వంటి ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. ఇక ఈ బైక్‌లో రెండు బ్యాటరీ వేరియంట్లు ఉంటాయి. ఇందులో 3.4 kWh LFP బ్యాటరీ సింగిల్ చార్జ్‌పై 140 కిమీ రేంజ్ అందిస్తుంది. అలాగే 4.4 kWh బ్యాటరీ 175 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. ఇక ఈ రెండు బ్యాటరీ వేరియంట్లకూ 7.5 kW ఎలక్ట్రిక్ మోటార్ అందించబడింది. ఇది 52 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాప్ స్పీడ్ 95 kmph వరకు వెళుతుంది.

ఇక ధరల విషయానికి వస్తే.. ఎంట్రీ లెవెల్ వేరియంట్‌కి రూ.1.27 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరను నిర్ణయించగా, పెద్ద బ్యాటరీ వేరియంట్ ను రూ.1.37 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. అయితే ఈ ధరలు ప్రొమోషనల్ అవుట్‌పుట్ మాత్రమే. ఆ తర్వాత వీటి ధరలు 1.47 లక్షలు, 1.55 లక్షలుగా మారబోతున్నాయి. ఇక ఈ బైక్‌ను కొనాలనుకునే వినియోగదారులు కేవలం రూ.2,999 అడ్వాన్స్ తో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. బైక్ డెలివరీలు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయి.