Poco M7 Plus: పోకో అభిమానులకు శుభవార్త. పోకో త్వరలో భారత్‌లో Poco M7 Plus కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లో అందుకు సంబంధించిన టీజర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ టీజర్‌లను చూస్తుంటే.. Poco M7 Plus అతి త్వరలో విడుదలయ్యే అవకాశముందని లీకులు చెబుతున్నాయి. గతేడాది విడుదలైన Poco M6 Plus కు మరిన్ని అప్‌గ్రేడ్లతో ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి రానుందని అంచనా. మరి ఈ రాబోయే మొబైల్ సంబంధిత పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..
భారీ బ్యాటరీ:
Poco M7 Plus టీజర్‌లో “Power for All” అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఇది ఫోన్‌లో భారీ 7,000mAh బ్యాటరీ ఉండబోతున్న విషయాన్ని తెలుపుతోంది. ఇందులో 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుందని సమాచారం. దీని వల్ల యూజర్లు ఒకసారి చార్జ్ చేస్తే ఎక్కువ సేపు ఫోన్‌ను నిచ్చింతగా వాడొచ్చు.

ప్రాసెసర్:
ఫోన్‌లో Qualcomm నూతన Snapdragon 6s Gen 3 చిప్‌సెట్ ఉండనుందని లీకులు పేర్కొంటున్నాయి. ఇది మరింత వేగవంతమైన పనితీరు, మెరుగైన బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ను అందిస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ లో మంచి అనుభవం ఇచ్చే అవకాశం కూడా ఉంది.
డిస్‌ప్లే అండ్ డిజైన్:
Poco M7 Plusలో 6.9 అంగుళాల డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుందని అంచనా. ఇది Poco M6 ప్లస్ లో ఉన్న 6.79 అంగుళాల 120Hz డిస్‌ప్లేతో పోలిస్తే ఇందులో కాస్త పెద్దగా, మెరుగ్గా ఉంటుంది. ఇక మొబైల్ ప్యానెల్ నల్లరంగు ఫినిష్‌తో, డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. లుక్ పరంగా చాలా ట్రెండీగా, స్టైలిష్ గా ఉంటుంది.

కెమెరా సెటప్:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉంటాయని తెలుస్తోంది. ఇక M6 Plusలో ఉన్న 108MP+2MP డ్యూయల్ సెటప్ను మించిన ప్రాసెసింగ్ పవర్‌తో కొత్త కెమెరాలు మెరుగైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందించగలవు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌కి కూడా నాణ్యతగా ఉండనున్నాయి.
Vivo T4R 5G Price: ‘వివో టీ4ఆర్’ అమ్మకాలు షురూ.. 4 వేల లాంచింగ్ ఆఫర్!
ధర:
ఇంకా Poco అధికారికంగా పేరును ప్రకటించలేదు.. కానీ, లీకుల ప్రకారం ఈ ఫోన్‌ను ఆగస్టు 13న Poco M7 Plus పేరుతో లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ధర రూ.15,000 లోపే ఉండొచ్చని ఊహిస్తున్నారు. గత ఏడాది Poco M6 Plus రూ.13,499కు లాంచ్ అయ్యింది.

మొత్తంగా ఈ Poco M7 Plus మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో గేమ్ చేంజర్‌గా నిలవబోతోంది. భారీ బ్యాటరీ, 144Hz స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ చిప్ సెట్, ఆకర్షణీయమైన డిజైన్‌తో యువతను ఆకట్టుకునే విధంగా ఉంది. అధికారిక లాంచ్ కోసం ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. Poco మరోసారి “పవర్” అనేది తన బ్రాండ్‌కు తగినట్లే చూపించబోతోంది అనిపిస్తోంది.