Maruti Suzuki XL6: మారుతి సుజుకి ( Maruti Suzuki) లో భాగమైన నెక్సా (Nexa) ద్వారా విక్రయించే ఎంపీవీ కారు XL6 లో కొత్త ఫీచర్లను చేర్చింది. గతంలో ఎర్టిగా (Ertiga)కు చేసినట్లే, ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ మార్పులను చేసింది. ఈ కొత్త మార్పులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ద్వారా వెల్లడయ్యాయి. ఈ మార్పులు జీటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ అనే అన్ని వేరియంట్‌లకు వర్తిస్తాయి.
కొత్తగా అందించిన ఫీచర్లలో.. కారు వెనుక భాగంలో ఒక స్పాయిలర్ (spoiler) ఉంది. ఇది కారుకు స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. అయితే, పెయింట్ రంగులలో ఎలాంటి మార్పులు లేవు. నెక్సా బ్లూ, ఓప్యులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, బ్లూయిష్ బ్లాక్, ఇతర డ్యూయల్-టోన్ ఆప్షన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇక కారు XL6 ప్రారంభ ధర రూ. 11.94 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కొనసాగుతుంది.
Teja Sajja : చిరంజీవి ఒక ఫొటో తీస్తే నా జీవితం మారిపోయింది.. తేజ ఎమోషనల్
క్యాబిన్ లోపల, రెండవ వరుస ప్రయాణీకుల కోసం ఎయిర్-కండిషనింగ్ వెంట్లు సీలింగ్ నుండి సెంటర్ కన్సోల్ వెనుకకు మార్చారు. ఈ మార్పు వల్ల వెనుక సీట్లలో కూర్చునే వారికి అదనపు హెడ్‌రూమ్ లభిస్తుంది. అంతేకాకుండా, మూడవ వరుస ప్రయాణీకులకు ప్రత్యేకంగా ఎయిర్ వెంట్లు, బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్‌మెంట్ సౌకర్యం కల్పించారు. వీటిని కారు లోపల కుడి వైపున ఏర్పాటు చేశారు. అలాగే, కొత్తగా టైప్-C యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మధ్య వరుస ప్రయాణీకులకు రెండు పోర్ట్‌లు, మూడవ వరుస వారికి రెండు పోర్ట్‌లు ఇచ్చారు.
Vice President Election 2025: ఎన్డీఏ vs ఇండియా రె’ఢీ’.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎవరి బలమెంత?
ఇక ఇంజన్ విషయానికొస్తే.. XL6లో ఎలాంటి మార్పులు లేవు. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 102 BHP శక్తిని, 136.8 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కస్టమర్లకు సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది 87 BHP, 121.5 nm టార్క్‌ను అందిస్తుంది. అయితే, సీఎన్‌జీ వేరియంట్ కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది.