తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra XUV 3XO ZNG CNG: మహింద్ర తన మొదటి సీఎన్జీ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎస్యూవీ ప్రియులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న ‘మహింద్రా XUV 3XO’ సీఎన్జీ మోడల్‌ను కంపెనీ అధికారికంగా భారత మార్కెట్లో విక్రయానికి ప్రవేశపెట్టింది. అయితే ఈ కారును సాధారణంగా సీఎన్జీ అని పిలవకుండా ‘XUV 3XO ZNG’ అనే పేరుతో మార్కెట్లోకి తీసుకురావడం విశేషం. ప్యాసింజర్ వాహనాల విభాగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు మహింద్రా సిద్ధమైంది. దేశంలో గత కొంతకాలంగా సీఎన్జీ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతుండటంతో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్ల తర్వాత మహింద్రా ఈ విభాగంలోకి అడుగుపెట్టింది. ఆకర్షణీయమైన లుక్స్, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ, ఆధునిక ఫీచర్లతో వచ్చిన ఈ సీఎన్జీ ఎస్యూవీ ప్రారంభ ధరను రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
మహింద్రా ఈ ఎస్‌యూవీని మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. మోడల్ ఎంఎక్స్ ఎడ్జ్ ధర రూ. 9.99 లక్షలు కాగా, రివెక్స్ ఎడ్జ్ (ఓ) వేరియంట్ ధర రూ. 10.79 లక్షలుగా ఉంది. అలాగే ఏఎక్స్5 వేరియంట్ ధర రూ. 11.19 లక్షలు కాగా, టాప్ వేరియంట్ రివెక్స్ ఏ ధర రూ. 12.27 లక్షలుగా నిర్ణయించారు. రూపం, డిజైన్ విషయానికి వస్తే ఇది దాదాపు పెట్రోల్ వెర్షన్‌ను పోలి ఉంటుంది. కానీ ఎక్స్టీరియర్ డిజైన్‌లో కొన్ని చిన్న మార్పులు చేశారు. అందులో భాగంగా కారు వెనుక భాగంలో సీఎన్జీ బ్యాడ్జింగ్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక, ఇది భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన సీఎన్జీ కారుగా నిలుస్తుంది. ఇందులో 1.2-లీటర్ టీసీఎంపీఎఫ్ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 110 బిహెచ్పి పవర్, 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సీఎన్జీ మోడ్‌పై కేజీకి 24.70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. వేగం పుంజుకోవడంలో కూడా ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. కేవలం 11.8 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని మహింద్రా వెల్లడించింది.
Also Read
- e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
- Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
- పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
- Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
మరోవైపు, బూట్ స్పేస్ విషయానికొస్తే టాటా నెట్సన్ ఐసీఎన్జీ తరహాలోనే ఇందులో కూడా రెండు చిన్న సిలిండర్లను అందించారు. వీటిని బూట్ ఫ్లోర్ కింద అమర్చి, బలమైన మెటల్ స్ట్రాప్లతో భద్రపరిచారు. సాధారణంగా సీఎన్జీ కార్లలో పెద్ద సిలిండర్ల వల్ల డిక్కీలో లగేజ్ పెట్టుకోవడానికి స్థలం ఉండదు. కానీ ఈ కారులో డ్యూయల్ సిలిండర్ అమరిక వల్ల ఏకంగా 270 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అంతేకాకుండా స్పేర్ వీల్‌ను కారు బాడీ కింద అమర్చడం వల్ల లోపల మరింత జాగ లభిస్తుంది. పైగా ఇందులో వాడిన సీఎన్జీ సిలిండర్లు ఎంతో సురక్షితమైనవని కంపెనీ స్పష్టం చేసింది. కారు లోపల ఫీచర్ల పరంగా చూస్తే, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. వీటితో పాటు 360 డిగ్రీల కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, రియర్ వైపర్ వంటి అనుకూలతలు ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని పెంచేందుకు నార్మల్, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు స్టీరింగ్ మోడ్‌లను అందించారు. ఇంకా పానోరమిక్ సన్‌రూఫ్, లెథరెట్ సీట్లు, డోల్బీ ఆట్మాస్ సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ముందు-వెనుక భాగాల్లో ఆర్మ్‌రెస్ట్‌లు ఉన్నాయి. మొదటి వరుస సీట్లకు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ సదుపాయం కూడా ఇచ్చారు.
ప్రయాణం హాయిగా సాగేందుకు ముందు వైపు ఇండిపెండెంట్ సస్పెన్షన్, వెనుక వైపు సెమీ-ఇండిపెండెంట్ సస్పెన్షన్‌ను అందించారు. రెండు వైపులా ఎమ్‌టీవీ సీఎల్ డాంపర్లు, ముందు భాగంలో సోలిడ్ యాంటీ-రోల్ బార్ అమర్చారు. ఈ సస్పెన్షన్ సెటప్ వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, అధిక వేగంలో వెళ్లేటప్పుడు కారు హ్యాండ్లింగ్ చాలా స్థిరంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా నెట్సన్ సీఎన్జీ (ప్రారంభ ధర రూ. 8.35 లక్షలు), మారుతి బ్రెజ్జా సీఎన్జీ (ప్రారంభ ధర రూ. 9.40 లక్షలు), హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ (ప్రారంభ ధర సుమారు రూ. 7 లక్షలు) వంటి కార్లకు ఇది గట్టి పోటీగా నిలవనుంది.
తాజావార్తలు
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..