Cars in August:ఫెస్టివల్ సీజన్ రాబోతోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కార్ మేకర్ కంపెనీలు కూడా తమ కొత్త మోడళ్లని మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతున్నాయి. ముందు ఆగస్టు నెలలో మూడు SUV కార్లు ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ అవుతున్నాయి. దేశీయ కార్ కంపెనీలు మహీంద్రా, టాటాతో పాటు ఫ్రెంచ్ ఆటోమేకర్ సిట్రోయెన్ నుంచి కొత్త కారు రాబోతోంది.
చాలా మంది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న థార్ 5- డోర్ వెర్షన్ ‘‘థార్ రోక్స్’’, టాటా నుంచి కర్వ్‌తో పాటు సిట్రోయెన్ నుంచి బసాల్ట్ కార్లు ఆగస్టులో అమ్మకాలకు సిద్ధమయ్యాయి.
మహీంద్రా థార్ రోక్స్:
మహీంద్రా థార్ రోక్స్ ఆగస్ట్ 14న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఇప్పటికే దాని ఎక్స్‌టీయర్స్‌తో టీజర్ రిలీజ్ చేసింది. కొత్త గ్రిల్, ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, సర్క్యులర్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్, టెయిల్ ల్యాంపులు యకూడా ఎల్ఈడీ యూనిట్లను ఇస్తున్నారు. అల్లాయ్ వీల్స్‌ని రీడిజైన్ చేశారు. 360 డిగ్రీ కెమెరా, పరోనమిక్ సన్‌రూఫ్ కూడా ఉంది.
అయితే, దాని ఇంటీరియర్స్ గురించి పెద్దగా తెలియనప్పటికీ, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఉండబోతున్నట్లు సమాచారం. ఇంజిన్ ఎంపికలు 1.5-లీటర్ D117 CRDe డీజిల్, 2.2-లీటర్ mHawk 130 CRDe డీజిల్, 2.0-లీటర్ mStallion 150 TGDi పెట్రోల్ ఉండే అవకాశం ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ఉండవచ్చు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో, 4 వీల్ డ్రైవ్‌తో రావచ్చు. థార్ రోక్స్ మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ గుర్ఖాలకు ప్రత్యర్థిగా రాబోతోంది.
టాటా కర్వ్:
ఇండియాలో తొలిసారిగా కూపే స్టైల్ డిజైన్‌తో టాటా కొత్తగా కర్వ్ ఎస్‌యూవీ కారును తీసుకురాబోతోంది. ఆగస్టు 07న ఇది మార్కెట్లో ప్రారంభించబడుతోంది. ఐసీఈ ఇంజన్‌తో పాటు ఈవీ అవతార్లలో ఈ కారు అందుబాటులో ఉండబోతోంది. టాటా Curvv పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా మరియు లెవెల్ 2 ADAS వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. టాటా కర్వ్ (ఐసీఈ) హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కార్లకు పోటీ ఇవ్వనుంది. ఇక ఎలక్ట్రిక్ మోడల్ MG ZS EV, BYD Atto 3 ప్రత్యర్థిగా ఉండనుంది.
Tata Curvv EV ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో 500కిమీలకు దగ్గరగా ఉంటుందని మేము భావిస్తున్నాము. దీని ధర రూ. 18 లక్షల నుంచి రూ. 24 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.Tata Curvv ICEలోని ఇంజన్ ఆప్షన్లు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్‌గా ఉంటాయి. దీని ధర రూ. 11 లక్షల నుండి రూ. 19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.
సిట్రోయెన్ బసాల్ట్:
సిట్రోయెన్ బసాల్ట్ కూడా టాటా కర్వ్ మాదిరిగానే కూపే స్టైల్ డిజైన్‌తో వస్తోంది. C3 ఎయిర్‌క్రాస్, C5 ఎయిర్‌క్రాస్, C3, E-C3 తర్వాత భారతదేశంలో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ విడుదల చేస్తున్న ఐదో మోడల్. బసాల్ట్‌లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, 17-ఇంచ్ అల్లాయ్‌లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఫ్రంట్-వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయి. 1.2-లీటర్ Gen-3 టర్బో ప్యూర్‌టెక్ పెట్రోల్ ఇంజన్‌తో రాబోతోంది. భారతదేశంలో సిట్రోయెన్ బసాల్ట్ ధర రూ. 10 లక్షల నుండి రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. ఇది టాటా కర్వ్, క్రేటా, గ్రాండ్ విటారా, హైరైడర్, ఎలివేట్, కుషాక్, టైగున్‌లకు పోటీ ఇవ్వనుంది.