టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనాను ఓ పాకిస్థాని స్పోర్ట్స్ జర్నలిస్ట్ ‘ఎక్స్’ వేదికగా ట్రోల్ చేయాలనీ భావించాడు. కాకపోతే దానికి సురేష్ రైనా తనదైన శైలిలో బదులిచ్చాడు. ఆ సమాధానం దెబ్బకి సదరు పాక్ జర్నలిస్ట్ నోరు మూయించాడు రైనా. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి రైనా సమయస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక అసలు ఏమి జరిగిందన్న విషయానికి వస్తే..
AI Anchors: 50 భాషలలో ఏఐ యాంకర్లు రాబోతున్నారా.. డీడీ కిసాన్ వెల్లడి..
తన క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత సురేశ్ రైనా కామెంటేటర్ గా తన రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు. హిందీ వ్యాఖ్యానంతో ఆయన అభిమానులను అలరిస్తున్నాడు. తనకే సొంతమైన ఛలోక్తులతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడిగా.. ధోనీ సన్నిహితుడిగా తన జ్ఞాపకాలను కామెంట్రీలో పంచుకుంటున్నాడు. కామెంట్రీలో నైపుణ్యం పొందిన సురేశ్ రైనాను ఓ మ్యాచ్ సందర్భంగా ఆకాశ్ చోప్రా తన రిటైర్మెంట్ పై పునరాచోలన చేస్తావా అంటూ ప్రశ్నించాడు. దాంతో రైనా.. యూటర్న్ తీసుకునేందుకు తానేమైనా షాహిద్ అఫ్రిదినా..? అంటూ బదులిచ్చాడు. దీనికరణం షాహిద్ అఫ్రిది ఇదివరకు తన కెరీర్‌లో చాలా సార్లు రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకున్నాడు. ఇక ఈ రైనా కామెంట్స్‌ను మనసులో పెట్టుకొని పాకిస్థాన్ స్పోర్ట్స్ కంటెంట్ రైటర్ ఇమ్రాన్ సిద్దిఖ్ రైనాను ట్రోల్ చేయాలనీ ట్రై చేసాడు.
Wines Closed: మందుబాబులకు మళ్లీ షాక్.. మరోమారు వైన్ షాప్స్ బంద్..
ఇందుకు గాను.. షాహిది అఫ్రిదిని ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ కు ప్రచారకర్తగా ఎంపిక చేసిందంటూ విషయాన్ని తెలియజేస్తూ సురేశ్ రైనాను ఇమ్రాన్ ట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఇందుకు సురేశ్ రైనా అతనికి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు. తానేమి ఐసీసీ ప్రచారకర్తను కాదని., కానీ 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడినని చెప్పాడు. మోహాలీలో మేం ఆడిన మ్యాచ్ గుర్తుందా..? నాకు తెలిసి ఆ మ్యాచ్ నీకు మరిచిపోలేని జ్ఞాపకాలను గుర్తు చేస్తుందనుకుంటా’ అంటూ అతని అని నోరు మూయించాడు రైనా.
I’m not an ICC ambassador, but I have the 2011 World Cup at my house. Remember the game at Mohali? Hope it brings back some unforgettable memories for you. https://t.co/5H3zIGmS33
— Suresh Raina🇮🇳 (@ImRaina) May 24, 2024