Indian Scout: ఇండియన్ మోటార్‌సైకిల్ (Indian Motorcycles) కంపెనీ తన ప్రఖ్యాత స్కౌట్ సిరీస్ మోటార్‌సైకిళ్లను ఆగస్టు 25న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో ఇప్పటికే చీఫ్, చీఫ్టెన్, చాలెంజర్, పర్స్యూట్, రోడ్‌మాస్టర్ మోడల్స్‌ను విడుదల చేసిన సంస్థ ఇప్పుడు స్కౌట్ సిరీస్‌తో బైక్ ప్రేమికులను ఆకట్టుకోనుంది. స్కౌట్ బైక్ 2014లో తొలిసారి పరిచయం అయినప్పటి నుంచి ఇండియన్ మోటార్‌సైకిల్ లైనప్‌లో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించింది. ఈ మోడల్ అనేక దేశాల్లో అత్యంత విజయవంతమైన క్రూయిజర్‌గా నిలిచింది. ఎంట్రీ-లెవల్ క్రూయిజర్‌గా కూడా ఇది మంచి ఆదరణ పొందింది.
క్రూయిజ్ కంట్రోల్‌తో Hero Glamour X భారత మార్కెట్లో లాంచ్.. ధరలు, ఫీచర్లు వివరాలు ఇలా!
ఇకపోతే, ఇండియన్ స్కౌట్ బైక్‌లు లేడ్బ్యాక్ క్రూయిజర్ డిజైన్‌లో వస్తాయి. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్, పొడవైన ట్యాంక్, షార్ట్ టెయిల్ వీటికి క్లాసిక్ లుక్ ఇస్తాయి. వెర్షన్‌ను బట్టి డిజైన్‌లో కొంత మార్పు ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం స్కౌట్ బైక్‌లు పలు వెర్షన్లలో లభించనున్నాయి. వీటిలో స్కౌట్ క్లాసిక్ (Scout Classic), స్కౌట్ బాబర్ (Scout Bobber), స్పోర్ట్ స్కౌట్ (Sport Scout), స్కౌట్ సిక్స్టీ క్లాసిక్ (Scout Sixty Classic), స్కౌట్ సిక్స్టీ బాబర్ (Scout Sixty Bobber), సూపర్ స్కౌట్ (Super Scout), 101 స్కౌట్ (101 Scout) లు ఉన్నాయి.
ఈ ఇండియన్ స్కౌట్ బైక్‌లలో 1250 సీసీ లిక్విడ్-కూల్డ్ V-ట్విన్ ఇంజిన్ ను అందించనున్నారు. ఇందులో కొత్త పిస్టన్లు, పెద్ద వాల్వులు, తక్కువ బరువు కలిగిన మార్పులతో ఈ ఇంజిన్‌ను డిజైన్ చేశారు. మోడల్‌ను బట్టి ఈ ఇంజిన్ 105 నుండి 111hp పవర్, 108nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.