క్రూయిజ్ కంట్రోల్‌తో Hero Glamour X భారత మార్కెట్లో లాంచ్.. ధరలు, ఫీచర్లు వివరాలు ఇలా!
- హీరో గ్లామర్ X (Hero Glamour X)ను భారత మార్కెట్లో లాంచ్
- ట్యాంక్ ష్రౌడ్స్, కర్వ్స్, క్రీజ్ లైన్స్ కారణంగా స్పోర్టీ లుక్
- డిస్క్ వేరియంట్ ధర రూ.99,999 (ఎక్స్-షోరూం)
- డ్రమ్ వేరియంట్ ధర రూ.89,999 (ఎక్స్-షోరూం).
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Glamour X: హీరో మోటోకార్ప్ తన 125cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో మరో కొత్త బైక్ ను తీసుకొచ్చింది. తాజాగా కంపెనీ హీరో గ్లామర్ X (Hero Glamour X)ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్ డ్రమ్ వేరియంట్ ధర రూ.89,999 (ఎక్స్-షోరూం) కాగా, డిస్క్ వేరియంట్ ధర రూ.99,999 (ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు. కొత్త గ్లామర్ Xలో డిజైన్‌తో పాటు ఫీచర్లలో కూడా గణనీయమైన మార్పులు చేశారు. మరి ఈ కొత్త బైకు పృథి వివరాలను పూర్తిగా చేసేద్దామా..
Rekha Gupta Attacked: ఢిల్లీ సీఎంకు చేదు అనుభవం.. రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టిన యువకుడు
Also Read
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..

కొత్త గ్లామర్ X కాస్త ఎక్కువ బల్కీ బాడీ డిజైన్‌తో వచ్చింది. ట్యాంక్ ష్రౌడ్స్, కర్వ్స్, క్రీజ్ లైన్స్ కారణంగా స్పోర్టీ లుక్ లో కనిపిస్తుంది. ఈ కొత్త H-ఆకారపు డే టైమ్ రన్నింగ్ లైట్ (DRL)తో కూడిన హెడ్‌ల్యాంప్, అలాగే సమానమైన డిజైన్‌లో టెయిల్‌ల్యాంప్ ఉండటం బైక్‌ను మరింత కొత్తగా చూపిస్తుంది. ఇక రైడింగ్‌లో సౌకర్యం కోసం హ్యాండిల్‌బార్ వెడల్పును 30 మిల్లీమీటర్లు పెంచారు. రైడర్‌కు అప్‌రైట్ సీటింగ్ పొజిషన్, 790 mm సీటు ఎత్తు, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. పిలియన్ కోసం సీటులో 10% అదనపు స్థలం కల్పించడంతో పాటు వెడల్పైన గ్రాబ్‌రైల్స్‌ను కూడా జోడించారు.
DSR Group: మాజీ ఎంపీ ఇల్లు సహా పలు కంపెనీల్లో ఐటీ సోదాలు.. లిక్కర్ స్కాం దిశగా దర్యాప్తు?
ఈ కొత్త గ్లామర్ Xలో కలర్-చేంజింగ్ LCD స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రైడర్ 60కి పైగా ఫీచర్లు పొందవచ్చు. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ బైక్‌లో ప్రత్యేకంగా రైడ్-బై-వైర్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు ఇచ్చారు. అంతేకాకుండా ఈ బైక్ లో ఎకో, రోడ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇంకా భద్రత కోసం రియర్ పానిక్ బ్రేక్ అలర్ట్ ను కూడా జోడించారు. హీరో గ్లామర్ Xలో 124.7 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 11.3hp పవర్, 10.5nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ హీరో ఎక్స్‌ట్రీమ్ 125Rలో కూడా ఉపయోగించారు. బైక్‌ను డైమండ్-టైప్ ఫ్రేమ్ పై డిజైన్ చేశారు. మొత్తంగా ఈ కొత్త కొత్త గ్లామర్ X డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా 125cc సెగ్మెంట్‌లో వినియోగదారులకు మరింత విలువను అందించనుంది.

తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!