Honda Monkey Bike: బుల్లెట్ మోడల్లో హోండా మంకీ బైక్.. డిజైన్, బాబర్ స్టైల్ అదుర్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హోండా మోటార్‌సైకిల్ తాజాగా హోండా మంకీ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను విడుదల చేసింది. ఇప్పటికే హోండా నుంచి అనేక బైక్‌లు ఇంకా స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో కొత్త బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్‌లో 125సీసీ ఇంజన్ ఉంది. లుక్ లో ఈ బైక్ బుల్లెట్ బైక్ కంటే ఎక్కువ. థాయ్‌లాండ్‌కు చెందిన హోండా ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను రిలీజ్ చేసింది. ఈ బైక్ ధర విషయానికోస్తే.. 108,900 THB అంటే 2.59 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్) . ఇండియా ధరల ప్రకారం ఈ 125సీసీ బైక్ చాలా ఖరీదైనది. ఎందుకంటే ఈ ధరలో భారతదేశంలో 300 ప్లస్ సీసీ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి.
Tomato Prices: టమాటా ధరలపై కూరగాయల విక్రేత కన్నీళ్లు.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ
Also Read
- BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
- Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
హోండా మంకీ బైక్‌లో ఇంజన్ విషయానికొస్తే.. 125సీసీ, 2 వాల్వ్, ఎయిర్ కూల్డ్ మోటార్ ఇంజన్ ఉంది. అంతేకాకుండా 9.2bhp శక్తిని (6,750rpm), 11Nm గరిష్ట టార్క్ (5,500rpm) ఉత్పత్తి చేయగలదు. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ బైక్‌కు బాబర్ లుక్ యాడ్ చేశారు. అందంగా కనిపిస్తున్న ఈ బైక్.. మైలేజ్ విషయంలో కూడా అలానే ఉంది. లీటర్ పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఇంధన సామర్థ్యం 5.6 లీటర్లు. ఏబీఎస్ బ్రేక్, 12 ఇంచ్ వీల్, బైక్ మొత్తం బరువు 104 కేజీలు.
Viral News: 100 మందితో డేటింగ్.. అది ఒకే సంవత్సరంలో..
ఈ బైక్ ప్రస్తుతం థాయిలాండ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇండియాలో మాత్రం ఈ బైక్ లాంచ్ గురించి ఎటువంటి సమాచారం లేదు. అంతేకాకుండా.. అధిక ధర ఇంకా తక్కువ సిసి భారతదేశంలో వర్కౌట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కారణం రాయల్ ఎన్‌ఫీల్డ్ 350, జావాతో సహా 350 సిసి బైక్‌లు దాదాపు అదే ధరలో లభిస్తాయి. ఇక హోండా బైక్ విషయానికొస్తే.. ఇండియాలో ఎంతో గుర్తింపు పొందింది. హోండా స్కూటర్లు ఇంకా బైక్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. హోండా యాక్టివా, డియో, హోండా షైన్, హోండా హైనెస్‌తో సహా ఎన్నో మోడళ్ల బైక్‌లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే, హోండా కంపెనీ కొత్త హోండా డియో 125 స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 83,400 (ఎక్స్-షోరూమ్).
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?