BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
- BYD ఎలక్ట్రిక్ SUV కొత్త ఎడిషన్ విడుదల
- ధర, బ్యాటరీ, పవర్ వివరాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BYD Sealion 7 Limited Edition: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ BYD ఎలక్ట్రిక్ SUV Sealion 7 Limited Editionను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ధరను రూ.50.6 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. ఈ ఎడిషన్‌లో కేవలం 150 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా ఫెస్టివ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ SUVలో కొత్త ఇంటీరియర్ కలర్ థీమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
BYD Sealion 7 స్టాండర్డ్ Premium వేరియంట్ ధర రూ.49.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, కొత్త Limited Edition ధర రూ.50.6 లక్షలుగా ఉంది. అంటే స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే ఈ ప్రత్యేక ఎడిషన్ కోసం కొనుగోలుదారులు అదనంగా రూ.70,000 చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ చేపట్టిన ‘Celebrate Your Dreams with BYD’ ప్రచారంలో భాగంగా ఈ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటంతో, తమ కారుకు ప్రత్యేకమైన లుక్ కోరుకునే వినియోగదారులను ఇది ఆకర్షించే అవకాశం ఉంది.
Also Read
- Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
- Toyota Innova Hycross Facelift: 360 డిగ్రీ కెమెరా, Wi-Fi, డ్యాష్‌క్యామ్‌తో ఇన్నోవా హైక్రాస్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
- Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
- Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
కొత్త ఇంటీరియర్‌తో ప్రత్యేక గుర్తింపు
ఈ Limited Editionలో ప్రధానంగా ఇంటీరియర్‌లో మార్పులు చేశారు. ఇందులో కొత్త టాన్ (Tan), బ్లాక్ (Black) కలర్ కాంబినేషన్ అందించారు. ప్రీమియం నప్పా లెదర్ అప్ హిల్స్టరీతో పాటు డ్యాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్స్‌పై కూడా ఇదే కలర్ థీమ్ కనిపిస్తుంది. ఈ కొత్త కలర్ కాంబినేషన్ వల్ల SUV లోపలి భాగానికి మరింత ప్రీమియం లుక్ లభిస్తుంది. అయితే, ఇంటీరియర్ రంగుల మార్పు మినహా మిగిలిన ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ విషయంలో ఇది స్టాండర్డ్ Premium వేరియంట్‌తో సమానంగా ఉంటుంది.
ఫీచర్లు అదుర్స్.. టెక్నాలజీకి పెద్దపీట
BYD Sealion 7 Limited Editionలో ఆధునిక సాంకేతిక ఫీచర్లను అందించారు. డ్రైవింగ్ సౌకర్యం, భద్రత, వినోదం కోసం ఇందులో పలు సదుపాయాలు ఉన్నాయి.
ప్రధాన ఫీచర్లు ఇవే:
360-డిగ్రీ కెమెరా
ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)
పనోరమిక్ గ్లాస్ రూఫ్
పవర్డ్ టెయిల్‌గేట్
డబుల్-గ్లేజ్డ్ గ్లాస్
10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
హెడ్-అప్ డిస్ప్లే (HUD)
15.6 అంగుళాల రొటేటింగ్ టచ్‌స్క్రీన్
12-స్పీకర్ల DYNAUDIO సౌండ్ సిస్టమ్
అంతేకాకుండా, ముందు సీట్లకు వెంటిలేషన్ సదుపాయం, డ్రైవర్ సీటుకు మెమరీ ఫంక్షన్ కూడా ఉన్నాయి. వీటితో పాటు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆల్-LED లైటింగ్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందించారు.
ఈ ఎలక్ట్రిక్ SUVలో 82.56kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇందులో రియర్-వీల్ డ్రైవ్ (RWD) మోటార్ ఉండగా, గరిష్ఠంగా 308bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఛార్జింగ్ కోసం 11kW AC ఛార్జర్ సదుపాయం కూడా ఉంది. సామాన్లు పెట్టుకునేందుకు ముందు భాగంలో ఫ్రంక్ (ఫ్రంట్ ట్రంక్), వెనుక భాగంలో బూట్ స్పేస్ అందించారు. ఈ రెండు కలిపి గరిష్ఠంగా 558 లీటర్ల స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. అయితే, ఈ వివరాల్లో బ్యాటరీ సామర్థ్యం, పవర్‌ట్రెయిన్, ఇతర ఫీచర్లు స్టాండర్డ్ Premium వేరియంట్లో ఉన్నట్లుగానే కొనసాగుతాయి. Limited Editionలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన మార్పు ఇంటీరియర్ కలర్ థీమ్ మాత్రమే.
తాజావార్తలు
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
ట్రెండింగ్
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!