భారతదేశంలో లెక్కకు మించిన బైకులు అమ్మకానికి ఉన్నాయి. అయితే చాలామంది సరసమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. మనం పోషించే బైక్స్ కాకుండా మనల్ని పోషించే బైక్స్ గురించి తెలుసుకుందాం..
Honda SP 125..
హోండా అందించే పాపులర్ బైక్‌లలో హోండా SP 125 అనేది బెస్ట్ సెగ్మెంట్ బైక్. ఇది చేస్తే లీటర్‌కు60కి.మీ మైలేజీని ఇస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. హోండా SP 125 కంపెనీకి 124cc, 4 స్ట్రోక్ ఇంజిన్ కలిగి ఉంది. 10.7ps అద్భుతమైన పవర్, 10.9Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అమర్చి ఉంది. కంపెనీ 11 లీటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. ఈ బైక్ ఒక లీటర్‌కు 63కి.మీ మైలేజీని ఇస్తుంది. ఈ రేంజ్లో మీరు పొందే అద్భుతమైన పవర్ఫుల్ బైక్ ఇదేనని చెప్పవచ్చు. కాగా.. ఈ బైక్ ధర రూ. 92,734 (ఎక్స్-షోరూమ్ ధర) నుంచి ప్రారంభమవుతుంది.
Splendor+ 2025
ఇటీవల.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అత్యంత ప్రజాదరణ పొందిన తన స్ప్లెండర్+ 2025 మోడల్‌ను విడుదల చేసింది. పాత మోడళ్లకు ఏ ఇంజిన్ ఇచ్చారో స్ప్లెండర్+ 2025 మోడళ్లలోనూ దాన్నే కొనసాగించారు. ఫేజ్-2 ఓబీడీ-2బి ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్‌ను తీర్చిదిద్దారు. ఇందులో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఇది 7.91 బీహెచ్పీ పవర్‌ను, 8.05ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గ్రాఫిక్స్ పరంగా కొన్ని మార్పులు చేశారు. స్పోర్టీ లుక్‌ను జోడించారు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను బ్లూటూత్‌తో కనెక్ట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. సీటు, లగేజీ ర్యాక్‌లో మార్పులు చేశారు. అయితే, ఇవి టాప్ ఎండ్ మోడళ్లకే పరిమితం. హీరో స్ప్లెండర్+ మొత్తం ఆరు రకాల వేరియంట్లలో లభిస్తుంది. స్ప్లెండర్+ డ్రమ్, స్ప్లెండర్+ ఐ3, స్ప్లెండర్+ ఐ3ఎస్ బ్లాక్ అండ్ యాక్సెంట్, స్ప్లెండర్+ ఎక్స్‌టెక్ డ్రమ్ బ్రేక్, స్ప్లెండర్+ ఎక్స్‌టెక్ డిస్క్‌బ్రేక్, స్ప్లెండర్+ ఎక్స్‌టెక్ 2.0 డ్రమ్ బ్రేక్ ఆప్షన్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ.79,096 (ఎక్స్ షోరూమ్) కాగా.. హై ఎండ్ వేరియంట్ ధర రూ.86,051గా కంపెనీ నిర్ణయించింది.
TVS Star City Plus 2025..
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ 110cc ఇంజిన్‌తో కూడిన స్పోర్ట్స్ కమ్యూటర్ బైక్. దీని ధర సుమారు రూ. 77,441 (ఎక్స్ షోరూమ్) నుంచి రూ. 80,441 వరకు ఉంది. ఇందులో 109.7 cc BS6 ఇంజిన్ అమర్చారు. ఈ బైక్ 8.08 bhp శక్తి, 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 4-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు. బరువు: 115 కిలోలు. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. వీల్‌బేస్ 1260 mm, మైలేజీ 68 కి.మి వరకు ఇస్తుంది.
Honda Shine 100 ..
హోండా షైన్ 100 బైక్ కూడా మధ్యతరగతి వాళ్లకు చాలా బెస్ట్. హోండా షైన్ 100 పూర్తిగా నో-ఫ్రిల్స్ డిజైన్‌ను కలిగి ఉంది. పాపులర్ షైన్ 125 DNA కలిగి ఉంటుంది. కాంపాక్ట్ రూపంలో ఉంటుంది. క్లీన్ లైన్లు, హెడ్‌ల్యాంప్ యూనిట్, ఇంటిగ్రేటెడ్ టెయిల్ సెక్షన్‌తో షైన్ 100 రోజువారీ రైడర్ల కోసం బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. హోండా బైక్ ట్యాంక్ కింద 98cc 4 స్ట్రోక్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇంజిన్ 7.38 పిఎస్ పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అద్భుతమైన లో-ఎండ్ టార్క్, స్మూత్ పవర్ డెలివరీ కోసం ట్యూన్ అయింది. స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌కు బైక్ అనువైనది. కంపెనీ ఈ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందిస్తుంది. ఈ బైక్ సిటీ డ్రైవింగ్ కోసం తయారైంది. ఈ బైక్ మీకు 55 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ధర రూ. 66,900 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై రూ. 68,767 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
Bajaj Platina 100..
మరో మధ్యతరగతి బైక్ బజాజ్ ప్లాటినా 100. ఇది 102 cc, 4-స్ట్రోక్, DTS-i సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. 7.79 bhp శక్తి, 8.34 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర సుమారు రూ. 66,933(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఇది నాలుగు డ్యూయల్-టోన్ రంగులలో లభిస్తుంది. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు అమర్చారు. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లు. బరువు 117 కిలోలు.లీటరుకు 70 కి.మీ. వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
New TVS Sport..
కొత్త టీవీఎస్ స్పోర్ట్ మోటార్‌సైకిల్ 109.7సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది 8.19 పీఎస్ హార్స్పవర్, 8.7ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ బైక్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీ వరకు అందిస్తుంది, రైడర్లు సుదూర పట్టణాలకు హాయిగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. కొత్త టీవీఎస్ స్పోర్ట్ మోటార్ సైకిల్ బరువు కేవలం 112 కిలోలు, 10 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ 175 మి.మీ. దీని ఎక్స్ షోరూం ధర రూ. 69,122 – 72,835 గా కంపెనీ నిర్ణయించింది.
TVS Raider 125 :
టీవీఎస్ విడుదల చేసిన బెస్ట్ బైక్‌ల్లో రైడర్ 125 ఒకటి. ఇది 6 వేరియంట్లలో, 12 అందమైన రంగుల్లో లభిస్తుంది. ఇంజిన్ కెపాసిటీ 124.8 సీసీ ఉంటుంది. 11.2 bhp పవర్, 11.2 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 56.7 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తోంది. కెర్బ్ వెయిట్123 కేజీ. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. మార్కెట్లో ఈ టీవీఎస్ రైడర్ 125 బైక్ ధర సుమారుగా రూ.90,094 (ఎక్స్ షో రూం) నుంచి ప్రారంభమవుతుంది.
Bajaj Pulsar 125 :
ఇండియాలోని మోస్ట్ పాపులర్ బైక్‌ల్లో బజాజ్ పల్సర్ 125 ఒకటి. ఈ బండి 6 వేరియంట్లలో, 8 రంగుల్లో లభిస్తుంది. ఇంజిన్ కెపాసిటీ 124.4 సీసీ. ఇది 11.4 bhp పవర్ , 10.5 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 50 కి.మీ/లీటర్ మైలేజీ ఇస్తుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 11.5 లీటర్స్. మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్ 125 బైక్ ధర సుమారుగా రూ.86,813 (ఎక్స్ షో రూం) నుంచి ప్రారంభమవుతుంది.
Honda Shine 125:
హోండా షైన్ బైక్ 2 వేరియంట్లలో, 5 అందమైన రంగుల్లో లభిస్తుంది. ఇంజిన్ కెపాసిటీ 123.94 సీసీ ఉంటుంది. 10.59 bhp పవర్, 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 55 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తోంది. కెర్బ్ వెయిట్113 కేజీ. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. మార్కెట్లో ఈ హోండా షైన్ బైక్ ధర సుమారుగా రూ.85,921(ఎక్స్ షో రూం) నుంచి ప్రారంభమవుతుంది.
Hero HF Deluxe..
హీరో HF డీలక్స్ మైలేజ్ లీటరుకు 70 kmpl (కిలోమీటర్లు) గా ఉంది. ఎక్స్-షోరూమ్ ధర ₹ 59,998 నుంచి ప్రారంభమవుతుంది. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.6 లీటర్లు.