Konaseema District 10th Class Student Pregnant: విద్యాబుద్ధులు నేర్పాల్సిన కరస్పాండెంట్.. విద్యార్థిని పట్ల అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. పదో తరగతి విద్యార్థినిని బలవంతంగా అత్యాచారం చేశాడు. మైనర్ బాలికకు పీరియడ్స్ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. 5వ నెల గర్భవతి అని వైద్యులు దృవీకరించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేయగా.. కరస్పాండెంట్‌పై పోక్సో కేసు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మాచవరం గ్రామానికి చెందిన ఆకుమర్తి జయరాజు గ్రామంలో మార్గదర్శి ఇంగ్లీష్ స్కూల్‌ను నడుపుతూ.. కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదే స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై జయరాజు కన్నుపడింది. మార్చి 26న జయరాజు తన ఆఫీస్ రూమ్‌కు మైనర్ బాలికను రప్పించుకున్నాడు. బాలికను అలమారులో ఉన్న ఫైల్స్ తీయమని ఆదేశించాడు. బాలిక ఫైల్స్ తీస్తుండగా.. జయరాజు వెనుక నుంచి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. బాలిక కేకలు వేయడంతో నోరు నొక్కి చంపేస్తానని బెదిరించాడు. ఆపై బలవంతం విద్యార్థినిని అలావంతంగా అత్యాచారం చేశాడు.
Also Read: MLA Somireddy: వైఎస్ జగన్‌కు ఆ అర్హత ఉందా?.. కాకాణి పాపాలు రెండు రోజుల్లో బయటపెడతా!
అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు పీరియడ్స్ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె 5వ నెల గర్భవతిగా వైద్యులు దృవీకరించారు. దీంతో బాలికను తల్లిదండ్రులు నిలదీయగా విషయం బయటపడింది. రాయవరం పోలీసులకు మైనర్ బాలిక తల్లిదండ్రులు పిర్యాదు చేశారు. దీంతో నిందితుడు ఆకుమర్తి జయరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితున్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు మార్గదర్శి స్కూల్ అనుమతులు రద్దు చేసి.. మూయించి వేశారు. ఆ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వం పాఠశాలలో చేర్పించారు.