పల్సర్ బైకులకు క్రేజీ డిమాండ్ ఉంటుంది. బైక్ లవర్స్ పల్సర్ బైకులకే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. స్టన్నింగ్ లుక్, మైలేజ్, క్వాలిటీ పరంగా బెస్ట్ గా ఉంటుండడంతో ఈ బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా అప్ డేటెడ్ వర్షన్ లతో బజాజ్ కంపెనీ సరికొత్త బైకులను మార్కెట్ లోకి తీసుకొస్తున్నది. తాజాగా బజాజ్ కంపెనీ తన పాపులర్ బైక్ పల్సర్ ఎన్ఎస్ 125ను కొత్త అప్ డేట్ లతో రిలీజ్ చేసింది. మరి ఈ బైక్ ధర ఎంతో ఇప్పుడు చూద్దాం.
పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ కొత్త వేరియంట్లలో డిస్క్ బ్రేక్ తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) అందించారు. ఈ ఫీచర్ తో ఈ బైక్ మరింత సురక్షితంగా మారింది. ఈ బైక్ మార్కెట్ లో హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్ కు గట్టిపోటీనిస్తుంది. పల్సర్ ఎన్ఎస్ 125లో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్ లతో కొత్త హెడ్ ల్యాంప్ లు అదించారు. బజాజ్ ఆటో నుంచి వచ్చిన ఈ కొత్త పల్సర్ ఎన్ఎస్ 125 ధర దాదాపు రూ. 1.6 లక్షలు(ఎక్స్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది.
Also Read:Nizamabad: నిజామాబాద్ మార్కెట్ యార్డులో టెన్షన్ టెన్షన్..
పల్సర్ ఎన్ఎస్ 125 బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ బైక్ పూర్తి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంది. ఇది రియల్ టైమ్ ఇంధన వినియోగం, స్పీడోమీటర్, మైలేజ్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి సమాచారాన్ని అందిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. మొబైల్ ఫోన్ ఛార్జ్ చేయడానికి యూఎస్ బీ పోర్ట్ కూడా అందించారు. సైడ్ స్టాండ్ కటాఫ్ తో వస్తుంది.
Also Read:Rakul: కెరీర్ కోసం తిప్పలు తప్పవు : రకుల్ ప్రీత్ సింగ్
బజాజ్ పల్సర్ NS 125 ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 124.45 cc ఎయిర్ కూల్డ్, 4-వాల్వ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 12bhp పవర్, 11Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో 240mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130mm డిస్క్ బ్రేక్ ఉన్నాయి. బజాజ్ పల్సర్ NS 125 ARAI సర్టిఫైడ్ మైలేజ్ లీటర్ కు 64.75 కి.మీ.