Bajaj Auto: బైక్‌కొనే ప్లాన్ చేస్తున్నారా? అయితే, గుడ్ న్యూస్ చెప్పింది బజాజ్ ఆటో లిమిటెడ్.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన తర్వాత.. బైక్‌లతో పాటు త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల ధరలపై ప్రభావం చూపనున్న విషయం విదితమే కాదు.. బజాజ్ మోటార్ సైకిళ్ల ధర రూ.20,000 వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది ఆ సంస్థ.. బజాజ్ ఆటో లిమిటెడ్, ఇటీవలి GST తగ్గింపు ప్రయోజనాన్ని దాని సంబంధిత బజాజ్ మరియు KTM మోటార్ సైకిళ్లు, త్రీ వీలర్ శ్రేణిలోని వినియోగదారులకు పూర్తిగా బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం యొక్క ఈ చర్య సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి రావడంతో, భారతదేశంలోని అన్ని డీలర్‌షిప్‌లలో తగ్గింపు ధరలతో వినియోగదారులు ఇప్పుడు పండుగ సీజన్‌ను ముందుగానే ప్రారంభించవచ్చు అని పేర్కొంది బజాజ్..
Read Also: Padi Kaushik Reddy : గ్రూప్-1 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
అయితే, పండుగ సీజన్ ప్రారంభం కావడానికి ముందే ధరల తగ్గింపుపై తీసుకున్న ఈ నిర్ణయం.. లక్షలాది కుటుంబాలు, రోజువారీ ప్రయాణికులు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.. ఇక, జీఎస్టీ సంస్కరణలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్టు పేర్కొంది బజాజ్ ఆటో లిమిటెడ్.. ఇది లక్షలాది మంది భారతీయులకు ప్రత్యక్షంగా ఉపయోగం కలిగిస్తోందని పేర్కొంది. GST తగ్గింపుపై బజాజ్ ఆటో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలపై GST తగ్గించాలనే ప్రభుత్వం నిర్ణయం సాహసోపేతమైన ముందడుగుగా అభివర్ణించారు.. ఇది డిమాండ్‌ను మరింత పెంచుతుంది.. పరిశ్రమను దృఢమైన వృద్ధి మార్గంలో ఉంచుతుందని.. లక్షలాది మందికి చేరువ చేస్తుంది.. ఈ చొరవకు భారత ప్రభుత్వానికి మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని పేర్కొన్నారు.. బజాజ్ ఆటో లిమిటెడ్‌లో, పండుగ సీజన్ ప్రారంభమైన వెంటనే మా వాహనాలను మరింత సరసమైన ధరకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాం.. సకాలంలో సంస్కరణ ఖచ్చితంగా వినియోగదారుల సెంటిమెంట్‌ను పెంచుతుంది.. పండుగ ఉత్సాహాన్ని పెంచుతుందని వ్యాఖ్యానించారు రాకేష్ శర్మ..