Ather Rizta vs TVS iQube: రేంజ్, ఫీచర్లు.. బడ్జెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ather Rizta vs TVS iQube: పెట్రోల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి, నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ఖర్చుతో, శబ్దం లేకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ట్రెండ్ మాత్రమే కాకుండా.. రోజువారీ అవసరంగా మారాయి. దీనితో వాటికీ భారీ డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో ప్రస్తుతం ఈవీ లలో బాగా పాపులర్ అయినా Ather Rizta, TVS iQube ప్రధాన పోటీదారులుగా నిలుస్తున్నాయి. ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్ అనే విషయాన్ని చూద్దాం.
డిజైన్ & లుక్:
ఏతర్ రిజత (Ather Rizta) ప్రత్యేకంగా కుటుంబ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ఇది వెడల్పాటి డిజైన్, పొడవైన సీటుతో ఇద్దరు వ్యక్తులు సౌకర్యంగా కూర్చునేలా ఉంటుంది. లుక్ కూడా ఆధునికంగా, కొత్తగా కనిపిస్తుంది. మరోవైపు టీవీఎస్ ఐకూబ్ (TVS iQube) డిజైన్ క్లాసిక్, సంప్రదాయ స్టైల్లో ఉంటుంది. ఇది సింపుల్, బ్యాలెన్స్డ్ డిజైన్‌ను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. కొత్త, ఫ్యామిలీ సెంట్రిక్ డిజైన్ కావాలంటే Rizta మెరుగ్గా కనిపిస్తుంది. అయితే సింపుల్, డీసెంట్ లుక్ కావాలంటే iQube మంచి ఎంపిక.
Also Read
- Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
- Norton Atlas India: భారత మార్కెట్లోకి నార్టన్ బైక్స్.. హోసూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం.. జూలైలో గ్లోబల్ లాంచ్!
- Skoda Peak EV: స్కోడా కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV ‘పీక్’ ఆవిష్కరణ.. 647KM రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్లు
- 160cc Bikes: మంచి మైలేజ్ కోసం చూస్తున్నారా?.. 160cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్‌లు ఇవే..!
వైభవ్ సూర్యవంశీకి Tata Motors స్పెషల్ గిఫ్ట్.. Tata Curvv SUV కారు బహుకరణ..!
బ్యాటరీ & రేంజ్:
Ather Rizta వివిధ బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వేరియంట్‌ను బట్టి ఇది సుమారు 120 నుంచి 160 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అదే TVS iQube కూడా వివిధ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది సుమారు 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. నగరంలో రోజువారీ ప్రయాణానికి ఈ రెండు స్కూటర్లు సరిపడా రేంజ్‌ను అందిస్తాయి.

పనితీరు:
Ather స్కూటర్లు స్మూత్ యాక్సిలరేషన్, ఫాస్ట్ పికప్‌కు ప్రసిద్ధి చెందాయి. Rizta కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మంచి పనితీరును అందిస్తుంది. మరోవైపు TVS iQube రైడింగ్ అనుభవం స్థిరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. నగర రోడ్లపై సాఫీగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. స్పోర్టీ ఫీల్ కావాలంటే Rizta మెరుగ్గా ఉంటుంది. స్థిరమైన, సౌకర్యవంతమైన రైడ్ కావాలంటే iQube మంచి ఎంపిక.
ఫీచర్లు & టెక్నాలజీ:
Ather Rizta పెద్ద టచ్‌స్క్రీన్ డిస్ప్లే, నావిగేషన్, కాల్ అలర్ట్స్, కనెక్టెడ్ ఫీచర్లతో వస్తుంది. అలాగే TVS iQube కూడా డిజిటల్ డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, యాప్ సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లను అందిస్తుంది. టెక్నాలజీ పరంగా Ather Rizta కొంచెం అడ్వాన్స్‌గా కనిపించినా, iQube కూడా అవసరమైన అన్ని స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
స్టోరేజ్:
Ather Rizta ప్రధాన బలం దాని పెద్ద స్టోరేజ్ అండ్ సీటు స్పేస్. అండర్-సీట్ స్టోరేజ్ ఎక్కువగా ఉండటం వల్ల కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే TVS iQube కూడా మంచి స్టోరేజ్ అందిస్తుంది. అయితే కుటుంబ వినియోగం, షాపింగ్ లేదా పిల్లలతో ప్రయాణానికి Rizta మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
Tollywood Excusive: సినిమా హిట్ అయితే హీరో హీరోయిన్లకు నేము, ఫేము.. మరి ప్లాప్ అయితే!
ధర:
Ather Rizta ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.10 లక్షల నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి పెరుగుతుంది. ఇక TVS iQube ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.00 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్లలో ధర ఎక్కువగా ఉండవచ్చు. ధరలో స్వల్ప తేడా ఉన్నప్పటికీ.. ఫీచర్లు, అవసరాల ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు.

మొత్తంగా చూసుకుంటే.. ఫ్యామిలీ ఉపయోగం, ఎక్కువ స్టోరేజ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోసం Ather Rizta మంచి ఎంపిక. అదే స్థిరమైన పనితీరు, సింపుల్ డిజైన్, విశ్వసనీయత కోసం TVS iQube కూడా అద్భుతమైన ప్రత్యామ్నాయం. వినియోగదారుల అవసరాలు, బడ్జెట్ ఆధారంగా ఈ రెండు స్కూటర్లలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!