Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
- టాటా సఫారీ EV వచ్చేస్తోంది..
- మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ ఇవ్వనున్న సఫారీ..
- 7-సీటర్ SUV విభాగంలో మరింత పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Safari EV: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే, టాటాకు మహీంద్రా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇదిలా ఉంటే, టాటా తన ఎలక్ట్రిక్ SUV విభాగాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో టాటా నుంచి సఫారీ EV మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ కార్ మార్కెట్లోకి రావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇది టాటా నుంచి వస్తున్న తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVగా నిలువొచ్చు. సఫారీ ఈవీ విడుదలైతే మహీంద్రా XEV 9S, MG హెక్టర్ టోమాహాక్ EV వంటి మోడళ్ల గట్టి పోటీ ఎదురవ్వనుంది.
సఫారీ నుంచి మహీంద్రా XEV 9Sకి గట్టి పోటీ..
ప్రస్తుతం ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టాటా మోటార్స్ ప్రముఖ స్థనాంలో ఉంది. టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, సియెర్రా, హారియర్ ఇలా బలమైన ఎలక్ట్రిక్ ఫోర్ట్‌పోలియోను కలిగి ఉంది. అయితే, ఇప్పటి వరకు 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV లేకపోవడం ఒక లోటుగా కనిపిస్తోంది. మరోవైపు, మహీంద్రా XEV 9S ఈ విభాగంలో వినియోగదారులను ఆకర్షిస్తోంది. సెప్టెంబర్ 2026లో టాటా పంచ్ EV తర్వాత అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లలో మహీంద్రా XEV 9S రెండో స్థానంలో ఉంది.
Also Read
- Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
- Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
- క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్లోకి Hyundai Creta 7-Seater.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..
- బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
ఈ నేపథ్యంలో టాటా సఫారీ EVని తీసుకురావడం ద్వారా 7-సీటర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని అనుకుంటోంది. ఈ కారు ఇప్పటికే పలుమార్లు రోడ్ టెస్టుల్లో కనిపించింది. అయితే, దీని విడుదల తేదీపై టాటా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
బ్యాటరీ, రేంజ్..
టాటా సఫారీ EVకు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ SUVను టాటా యాక్టి.ఈవీ+ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించే అవకాశం ఉంది. ప్రస్తుతం హారియల్ ఈవీలో ఏ బ్యాటరీ ప్యాక్ ఉపయోగిస్తున్నారో అదే సఫారీలో కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 65kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్స్ ఉండొచ్చు. 80kWh బ్యాటరీని కూడా ఉండొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. 75kWh బ్యాటరీతో కూడిన రియర్-వీల్-డ్రైవ్ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 622 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని అంచనా.
ఫీచర్లు ఎలా ఉండొచ్చు..
టాటా సఫారీ EV ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ సఫారీలాగే బయటకు కనిపించొచ్చు. అయితే, ఇంటీరియర్స్‌లో చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. రియల్ వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ ఆప్షన్లు కూడా ఉండొచ్చు. హారియర్ ఈవీలో ఉన్నట్లుగానే ట్రిపుట్ స్ట్రీన్ లే అవుట్ ఉండొచ్చు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఆడియో సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది.540-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, లెవెల్-2 ADAS, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్‌లను కూడా అందించొచ్చు.
టాటా సఫారీ ఈవీ ధర ఎంత..?
టాటా సఫారీ EV ధర సుమారు రూ.20 లక్షల నుంచి రూ.32 లక్షల మధ్య ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మహీంద్రా XEV 9S ప్రారంభ ధర రూ.20.65 లక్షలు కాగా, MG హెక్టర్ టోమాహాక్ EV ధర రూ.19.49 లక్షలుగా ఉంది. వీటికి పోటీ ఇచ్చేలా సఫారీ ఈవీ ధర ఉండొచ్చు.
తాజావార్తలు
-
Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
-
ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
-
Nara Rohith : త్రివిక్రమ్’పై ఆ ఒక్క కంప్లైంట్ ఉంది!
-
Ration Rice Scam : బ్రాండెడ్ బియ్యం ముసుగులో రేషన్ దందా.. హైదరాబాద్‌లో భారీ స్కామ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..