దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. కొత్త కొత్త సంస్థలతో పాటు ప్రముఖ కంపెనీలు కూడా ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేయడంతో కస్టమర్స్‌కు మంచి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆంపియర్ 2025 జనవరిలో విడుదల చేసింది.
భారత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ నుంచి గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ బైకులను తయారు చేశారు. ఓలా కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా గిగ్, ఓలా గిగ్+, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్+లను చేర్చింది.
జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్ తన వినియోగదారుల కోసం ఈఎంఐ చెల్లింపు సౌకర్యాన్ని గురువారం ప్రారంభించింది. రూ.2,999 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు ఈఎంఐ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది.