Munawar Farukhi: మునవార్ ఫరుఖి షో కు అనుమతిస్తే అడ్డుకుంటాం.. బీజేవైఎం వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునవార్ ఫారుఖీ.. ఇతనొక స్టాండప్ కమెడియన్. ఎప్పుడైతే కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘లాకప్’ షోలో అడుగుపెట్టాడో, అప్పట్నుంచి అతని దశ తిరిగిపోయింది. ఆ షోలో తనదైన కామిక్ టైమింగ్, కవిత్వాలతో అందరి మనసులు దోచాడు. అందుకే, ఆ షో విన్నర్‌గా నిలిచాడు. దీంతో, అతనికి సర్వత్రా క్రేజ్ నెలకొంది. అతనితో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అతను హైదరాబాద్‌కి రాబోతున్నాడు. ఈనెల 20వ తేదీన ‘డోంగ్రీ టు నోవేర్’ పేరుతో ఓ లైవ్ షో ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఫారుఖీ ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా వెల్లడించిన విషయం తెలిసిందే.. అయితే దీనిపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. బీజేపీ, బీజేవైఎం నాయకులు.. ఫారుఖీ షోను అడ్డుకుంటామని, అనుమతి ఇవ్వకూడదని తెలిపారు.
ఒకవేళ అనుమతిస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ డిజీపీని గోల్కొండ జిల్లా అధ్యక్షుడు బీజేవైఎం నితిన్ నందకర్ కలిసారు. ఈ షో కు అనుమతిస్తే అడ్డుకుంటామని తెలిపారు. హైదరాబాద్ లో ఆగస్టు 20 న మునవార్ ఫరుఖి షో నిర్వహిచకూడదని తెలిపారు. గతంలో కేటీఆర్ ఈ షో కి అనుమతిచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు మరోసారి అనుమతి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 20న షో జరిగితే అడ్డుకుంటామని అన్నారు. హిందువు దేవుళ్లను కించపరిచే విధంగా షో లో వాఖ్యలు ఉంటాయని పిర్యాదు చేశారు. ఈ షో ద్వారా హిందువులకు వ్యతిరేకంగా.. కమ్యునల్ ఇష్యూ జరుగుతుందని పిర్యాదు చేశారు. ఈ షో కు అనుమతి ఇవ్వకూడదని.. గోల్కొండ జిల్లా అధ్యక్షుడు బీజేవైఎం నితిన్ నందకర్ డీజీపీని కోరారు.
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ఈ నేపథ్యంలోనే ఆగస్టు 11న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఫారుఖీ షో నిర్వహిస్తే, ఆ ప్రదేశాన్ని తగలబెట్టేస్తామని హెచ్చరించారు. అతని ఈవెంట్ నిర్వహించకుండా ఆపాలని తెలంగాణ ప్రభుత్వం, పోలీసు అధికారుల్ని కోరారు. అతడ్ని ఎవరైనా సహకరిస్తే, వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు. గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా సీతాదేవిపై ఫారుఖీ జోకులు వేసినందుకు వివాదాస్పదమైంది. కర్ణాటకలో అతడ్ని బ్యాన్ చేశారు. అందుకే, హైదరాబాద్‌లోనూ అతడి షోలు నిర్వహించకూడదని రాజాసింగ్ కోరుతున్నారు.
Telugu Flim Chamber : సాయంత్రం 5 గంటలకి ఛాంబర్ మీట్
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!