Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..
- తమిళనాడు ఎన్నికలపై ఆసక్తికర సర్వే..
- ఆ పార్టీదే అధికారమని తేల్చిన లోక్ పోల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Elections: తమిళనాడు ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కొన్ని దశాబ్ధాలుగా డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకేగా ఉన్న పోరు ఇప్పుడు టీవీకే రూపంలో స్టార్ యాక్టర్ విజయ్ రావడంతో ముక్కోణపు పోటీగా మారింది. ఏప్రిల్ 23న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోసారి, డీఎంకే అధికారంలోకి వస్తుందని ‘‘లోక్ పోల్’’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
Read Also: Pakistan: పాకిస్తాన్‌కు భారీ షాక్.. అప్పు చెల్లించాలని యూఏఈ ఒత్తిడి..
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 40.1 శాతం ఓట్ల వాటాతో మొత్తం 234 స్థానాలకు గానూ.. 181 నుండి 189 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 మధ్య ఈ సర్వే జరిగింది. ప్రతిపక్ష అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 29 శాతం ఓట్లతో 38-42 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది.
కొత్తగా రాజకీయ ప్రవేశం చేసిన విజయ్ పార్టీ టీవీకే 23.9 శాతం ఓట్లతో 8-10 సీట్లు సొంతం చేసుకుంటుందని సర్వే చెప్పింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్‌కే మెజారిటీ ప్రజలు మద్దతు తెలిపారు. తర్వాత స్థానాల్లో విజయ్, పళనిస్వామి అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ వంటి సంక్షేమ పథకాలు డీఎంకేకు ప్లస్‌గా మారినట్లు సర్వే చెప్పింది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని మహిళలను ఈ పథకాలు బాగా ఆకట్టుకున్నాయని, ఇదే డీఎంకేకు మద్దతు ఇస్తుందని లోక్‌పోల్ సర్వే చెప్పింది. ఇదే కాకుండా టీవీకే, అన్నాడీఎంకే మధ్య ఓట్లు చీలిపోవడం కూడా డీఎంకేకు ప్లస్ అవుతుంది.
తాజావార్తలు
-
ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
ట్రెండింగ్
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!