Congress: రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే షాక్.. మోడీ సర్కార్‌కు కాంగ్రెస్ సీనియర్ల మద్దతు..
- రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే షాక్..
- మోడీకి మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ సీనియర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎల్పీజీ సంక్షోభం, ప్రభుత్వ విదేశాంగ విధానంపై రాహుల్ ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. కమల్ నాథ్, ఆనంద్ శర్మ, శశి థరూర్, మనీష్ తివారీ వంటి కాంగ్రెస్ ముఖ్యులు రాహుల్ గాంధీ అభిప్రాయంతో విభేధించారు. యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంపై మోడీ ప్రభుత్వ దౌత్య వైఖరిని రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే, మిగతా సీనియర్లు మాత్రం ప్రభుత్వం ఈ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించినట్లు ప్రశంసించారు.
Also Read
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
ప్రధాని మోడీ నాయకత్వం, విదేశాంగ విధానం ‘‘రాజీ’’ పడిందని విమర్శించగా, శశి థరూర్ మాత్రం ‘‘బాధ్యతాయుతమైన రాజనీతి’’గా అభివర్ణించారు. గురువారం ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ కేంద్రమంత్రి ఆనంద్ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. ఆనంద్ శర్మ తన సోషల్ మీడియా పోస్టులో..‘‘ ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ఐక్యతకు పిలుపునిచ్చారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని భారత్ పరిణితి, నైపుణ్యంతో నిర్వహించింది’’ అని కొనియాడారు. ఎల్పీజీ పరిస్థితిపై కమల్ నాథ్ మాట్లాడుతూ.. కొరత లేదని చెప్పారు.
కాంగ్రెస్ నేతల ప్రశంసల తర్వాత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందిస్తూ.. కాంగ్రెస్ ఇకనైనా తన రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం మానుకోవాలని హితవు పలికారు. ‘‘రాహుల్ గాంధీ ఒక అవకాశవాది, భారత వ్యతిరేకి అని కాంగ్రెస్‌కు తెలుసు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు.
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?