Meat Consumption: ప్రతీ ఏడాది 100 బిలియన్ల జంతువుల్ని తింటున్న మనుషులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meat Consumption: మాంసాహారం, శాఖాహారం ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది తేలని అంశం. అయితే కొన్ని సందర్భాల్లో శాఖాహార భోజనం బెటర్ అని చెబుతుంటారు. ప్రోటీన్స్ ఎక్కువగా రావాలంటే మాంసం తినాలని సూచిస్తుంటారు. చాలా మంది నాన్ వెజ్ అంటేనే ఇష్టపడుతుంటారు. ఇటీవల కాలంలో మనదేశంలో కూడా మాంసాహారం తీసుకోవడం పెరిగింది. ఇదిలా ఉంటే ది ఎకనామిస్ట్‌లోని పాత రిపోర్టు ఒకటి వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మాంసాహార రిపోర్టును చూస్తే దిమ్మతిరగాల్సిందే. ప్రతీ ఏడాది భూమిపై ఉండే మనుషులు 100 బిలియన్లు(10,000 కోట్ల) జంతువులను తింటున్నారని నివేదిక తెలిపింది.
Read Also: Pakistan: వైవాహిక అత్యాచారం కేసులో పాక్ కోర్టు ఇలాంటి తీర్పు ఇస్తుందని ఊహిస్తామా..?
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
ది ఎకనామిస్ట్‌లోని పాత నివేదిక ప్రకారం, వ్యవసాయ జంతువులు – కోళ్లు (19 బిలియన్లు), ఆవులు (1.5 బిలియన్లు), గొర్రెలు (1 బిలియన్లు) మరియు పందులు (1 బిలియన్లు) ఏడాదికి తింటున్నారు. మానవులు తినే జంతువుల సంఖ్య భూమిపై ఉన్న మానవులకు కొన్ని రెట్లు అధికంగా ఉంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. అన్ని జంతువుల్లో కోళ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రతీ రోజూ 20.5 కోట్ల కోళ్లను తింటున్నారు. ప్రతీ నిమిషానికి 1,40,000 కంటే ఎక్కువ కోళ్లు వధించబడుతున్నాయి. ప్రతీ ఏడాది 14 బిలియన్ల చేపల్ని, 3 బిలియన్ల రొయ్యల్ని, 2.9 బిలియన్ల బాతుల్ని తింటున్నట్లు వీడియో వెల్లడిస్తుంది. ఇవే కాకుండా ప్రతీ ఏడాది రెండు బిలియన్ల ఆక్టోపస్‌లని, 100 మిలియన్ల సొరచేపల్ని తింటున్నాం. 1.5 బిలియన్ల పందుల్ని వధిస్తున్నాము. గత 50 ఏళ్లలో ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
ఎక్కువగా మాంసం డిమాండ్ చైనాలో ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఇఎఫ్) తన నివేదికలో తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం వినియోగదారుగా ఉంది. దీనికి విరుద్ధంగా యూరప్, అమెరికాలో వినియోగం స్టేబుల్‌గా ఉంది. జనాభా పరంగా చైనాతో పోటీ పడుతున్న భారత్‌లో మాత్రం మాంసం తక్కువగా వినియోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. రెడ్ మీట్‌లో బీఫ్ గత 50 ఏళ్లలో దాని వాటా సగానికి పడిపోయి 22 శాతానికి చేరుకుందని తెలిపింది. ఇది గొర్రె మాంసం కన్నా 5 రెట్లు ప్రజాదరణ పొందింది.
Unbeliavable! Total number of animals eaten by people globally🧐
— Tansu Yegen (@TansuYegen) January 21, 2024
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!