Venu Goapl Reddy
Author- NTV Telugu-
Tamil Nadu: తమిళనాడులో మరోసారి “హిందీ” వివాదం.. మోడీకి లేఖ రాసిన సీఎం స్టాలిన్..
Tamil Nadu: తమిళనాడులో మరోసారి ‘‘హిందీ’’ వివాదం రాజుకుంది. హిందీయేరత రాష్ట్రాల్లో హిందీ భాషా ఆధారిత కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనను పునరాలోచించుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధాని మోడీకి లేఖ రాశారు. అక్టోబర్ 18, 2024న హిందీ మాస వేడుకల ముగింపు సందర్భంగా చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ లేఖ రాశారు. -
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. స్థానికేతరుడి హత్య..
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదుగు తెగపడ్డారు. అమాయకుడైన నాన్ లోకల్ కార్మికుడిని హతమర్చారు. శుక్రవారం ఉదయం బీహార్‌కి చెందిన వలస కార్మికుడు రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. దక్షిణ కాశ్మీర్‌లోని షోషియాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన ప్రాంతానికి వెంటనే భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేరుకుని, హత్యపై దర్యాప్తు ప్రారంభించారు. -
India-Canada Issue: ఖలిస్తానీ తీవ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు..కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
India-Canada Issue: భారత్, కెనడాల మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదంగా మారింది. గతేడాది నిజ్జర్ని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, ఈ హత్యలో భారత్ ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్లో ఆరోపించడంతో వివాదం చెలరేగింది. -
Swara Bhasker: సుప్రియా సూలేకి గొడుగు పట్టిన నటి స్వరాభాస్కర్ భర్త.. ఫహద్ అహ్మద్‌పై తెగ ట్రోలింగ్..
Swara Bhasker: బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ద్వేషిగా, హిందూ ద్వేషిగా విమర్శలు ఎదుర్కొనే స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్కి గురవుతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఫహద్‌ని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఎన్సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలేకి గొడుకు పట్టుకున్న వీడియో వైరల్ అయింది. మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ(ఎంపీఏ) ర్యాలీలో ప్రసంగిస్తున్న సుప్రియా సూలేకి ఫహద్ గొడుగు […] -
PM Modi Russia visit: మరోసారి రష్యాకి ప్రధాని మోడీ.. బ్రిక్స్‌కి పుతిన్ ఆహ్వానం..
PM Modi Russia visit: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లబోతున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు బ్రిక్స్ సదస్సుకు మోడీ హజరయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 22-23 తేదీల్లో కాజాన్‌లో జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలో పర్యటించనున్నారు. కజాన్‌లో జరిగే బ్రిక్స్ సదస్సు రష్యా అధ్యక్షతన జరుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తన పర్యటన సందర్భంగా.. ప్రధాని మోడీ బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో భేటీ కానున్నారు. -
Haryana Elections: ఏంటి ఇది..? హర్యానాలోని 20 స్థానాల్లో రీ-ఎలక్షన్ పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం..
Haryana Elections: ఇటీవల హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ రోజు నయాబ్ సింగ్ సైనీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, హర్యానాలోని 20 అసెంబ్లీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌ని గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారాన్ని నిలిపేసేందుకు నిరాకరించింది. -
Yahya Sinwar: హమాస్ చీఫ్, అక్టోబర్ 07 దాడుల మాస్టర్ మైండ్ హతం.. ఇజ్రాయిల్ హిట్ లిస్టులో తొలిపేరు…
Yahya Sinwar: ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 07 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి, దాడులకు ఆదేశాలు ఇచ్చిన హమాస్ నేత, ప్రస్తుతం ఆ సంస్థకు చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్‌ని ఇజ్రాయిల్ హతమార్చింది. ఈ వార్త నిజమైతే హమాస్‌ని కూకటివేళ్లతో పెకిలించినట్లే. -
Bangladesh: బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ భావజాలం.. జాతిపిత, స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం ఉన్న జాతీయ సెలవుల రద్దు..
Bangladesh: పాకిస్తాన్ దారిలో బంగ్లాదేశ్ పయణిస్తోంది. ఆ దేశ జాతీయ సెలువు దినాలను ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 7, ఆగస్టు 15 వేడుకలతో సహా 8 జాతీయ దినోత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించింది. బంగ్లాదేశ్ జాతిపితగా చెప్పబడే షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, 1971 స్వాతంత్ర్య సంగ్రామం స్పూర్తిపై దాడిగా ఈ నిర్ణయాన్ని పలువురు అభివర్ణిస్తున్నారు. -
Air India: ముంబై-లండన్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు..
Air India: వరస బాంబు బెదిరింపుల ఘటనలు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వరసగా నాలుగో రోజు కూడా బాంబు బెదిరింపు వచ్చాయి. ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్‌కి కొన్ని గంటల ముందు ఎమర్జెన్సీ సిగ్నల్స్‌ని పంపించినట్లు ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్ 24 గురువారం తెలిపింది. విమానం ‘‘స్క్వాకింగ్ 7700’’ కోడ్‌ని పంపించింది. ఇది సాధారణ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తుంది. -
Israel-Iran Conflict: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇరాన్‌పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి..?
Israel-Iran Conflict: నవంబర్ 5న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ముందే ఇరాన్‌పై ప్రతీకార దాడి చేయాలని ఇజ్రాయిల్ భావిస్తున్నట్లు అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయిల్‌పై ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణులను ఫైర్ చేసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడికి పాల్పడినంది. ఇజ్రాయిల్ లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఈ సందర్భంలోనే నస్రల్లాని బీరూట్‌లో వైమానికదాడి చేసి చంపేసింది. కీలకమైన హిజ్బుల్లా నాయకులను కూడా ఇజ్రాయిల్ ఎలిమినేట్…
తాజావార్తలు
-
OTR: కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
-
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?