UP: డీసీపీ ఆఫీస్ దగ్గర గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే.. 12 కార్లతో గ్యాంగ్‌స్టర్ హంగామా.. సీఎం యోగీ చూస్తే ఖతం..
- డీసీపీ ఆఫీస్ దగ్గర గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన గ్యాంగ్‌స్టర్..
- యూపీ కాన్పూర్‌లో ఘటన..
- వీడియోలు వైరల్ కావడంతో పోలీసుల చర్యలు..
- సీఎం యోగి కళ్లలో పడితే అంతే సంగతులంటూ నెటిజన్ల కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ తన ప్రియురాలి బర్త్ డేని ఘనంగా సెలబ్రేట్ చేయడం వివాదాస్పదంగా మారింది. డీసీసీ ఆఫీస్‌కి సమీపంలో 12 ఎస్‌యూవీ కార్లతో స్టంట్స్ చేస్తూ నానా హాంగామా చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. కాన్పూర్‌లోని బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని డీసీసీ కార్యాలయం వెనక ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌తో పాటు ఇందులో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రూల్స్ పట్టించుకోకుండా 12 వాహనాల కాన్వాయ్‌లో స్టంట్స్ చేస్తూ హంగామా చేశాడు. నెంబర్ లేని కార్లను డీసీసీ ఆఫీస్ దగ్గర నిర్భంగా నడిపాడు. కార్లలో విన్యాసాలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరారు. వీడియోల్లో బ్లాక్ స్కార్పియో వాహనాల కాన్వాయ్ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కారులో ముందు కూర్చున్న యువతి కెమెరా వైపు చేతులు ఊపుతూ కనిపించింది. ఈమెనే గ్యాంగ్ స్టర్ లవర్ అనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
Read Also: HYDRA : ఆ ఫిర్యాదులపై హైడ్రా ఫోకస్.. రంగంలోకి హైడ్రా కమిషనర్
27 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ అజయ్ ఠాకూర్‌పై మొత్తం 30కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇందులో టీనేజ్ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు డాక్టర్ దంపతుల కుమార్తెని బెదిరించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అతడి బెదిరింపులకు గురైన బాలిక అత్యాచారానికి గురైంది. పోలీసులు ఇతడిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
అయితే, గ్యాంగ్ స్టర్ సోషల్ మీడియా వీడియోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ కళ్లలో పడితే అంతే సంగతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్తార్ అన్సారీ వంటి సీనియర్ గ్యాంగ్‌స్టర్స్ యోగి దెబ్బకు గజగజ వణికిపోయారు. చాలా మంది ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. ఇలాంటి రీల్స్ చేసి ఆయన కళ్లలో కనకపడితే ప్రాణాలే ఉండవంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
12 गाडियों के काफिले में गर्लफ्रेंड का बर्थडे मनाने निकला गैंगस्टर
काली फिल्म,बिना नंबर प्लेट,गाड़ियों की कतार यह सब किसी #VIP का प्रोटोकॉल नहीं बल्कि एक गैंगस्टर का वीडियो है जो हूटर बजाते हुए डीसीपी साउथ ऑफिस के पीछे पहुंचा
जमकर स्टंट करे,वीडियो बनाई और सोशल मीडिया… pic.twitter.com/oi6D6NbzMp
— Simer Chawla (@Simerchawla20) January 7, 2025
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి