తమిళనాడులో దారుణం జరిగింది. తోటి విద్యార్థిని బ్లాక్‌మెయిల్ చేస్తూ ముగ్గురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థులంతా 10వ తరగతి చదువుతున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ బాలురంతా బాధిత విద్యార్థిని క్లాస్ మెట్సే. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కడలూర్ జిల్లాలో ఈ నెల 1న జరిగింది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వీడియోను రికార్డ్ చేసి ఇతరులకు షేర్ చేశారు.
తిట్టకుడి ఇన్ స్పెక్టర్ కిరుబా చెప్పిన వివరాల ప్రకారం.. కడలూర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే బాలిక తన ప్రియుడితో ఉన్న ఫోటోను తీసిని నిందితులు ఆమెను బ్లాక్‌మెయిల్ చేయసాగారు. ఇటీవల బాధిత బాలిక అదే కాలేజీలో 12వ తరగతి చదువుతున్న బాయ్ ఫ్రెండ్ పుట్టిన రోజు వేడుకల కోసం తన ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో వీరిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోలను తీశారు బాలికతో చదువుతున్న తోటి విద్యార్థులు. ఈ ఫోటోను మీ తల్లిదండ్రులకు చూపిస్తామని బెదిరించారు.
Read Also: IND Vs ENG: రాణించిన జడేజా.. రెండో టీ20లో ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే..?
ఫోటో కావాలంటే తన ఇంటికి కావాలని ఆమెను బెదిరించాడు ఓ బాలుడు. దీంతో సదరు బాధిత బాలిక అతను చెప్పినట్లే నిందితుడి ఇంటికి వెళ్లింది. అదే సమయంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు విద్యార్థులు, మొత్తం ముగ్గురు విద్యార్థులు, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీసి తోటి విద్యార్థులకు షేర్ చేశారు. ఈ వీడియోను చూపిస్తూ మరో విద్యార్థి బెదిరించాడు.ఈ ఘటన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా బాధిత బాలికను బెదిరించిన నాలుగో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.