Venu Goapl Reddy
Author- NTV Telugu-
EAM Jaishankar: ఇండియా ఐటీలో దూసుకెళ్తుంటే.. పాకిస్తాన్ వేరే రకం “ఐటీ”లో ఎక్స్పర్ట్
EAM Jaishankar comments on Pakistan: విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో దూసుకెళ్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఇంటర్నేషనల్ టెర్రరిజం(ఐటీ)లో ఎక్స్పర్ట్ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ వడోదరలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇప్పడు ప్రపంచం ఉగ్రవాదంపై గతం కన్నా మెరుగైన అవగాహనతో ఉందని ఆయన అన్నారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించదని.. ఇప్పడు తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశాలు ఒత్తడిలో ఉన్నాయని ఆయన అన్నారు. -
Imran Khan: పాక్ మాజీ ప్రధానికి ఎదురుదెబ్బ.. ఇమ్రాన్ ఖాన్‌కు అరెస్ట్ వారెంట్
Islamabad magistrate issues arrest warrant against Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ పై ఇస్లామాబాద్ మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మహిళా న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇస్లామాబాద్ కోర్టు అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ చేసినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత నుంచి పాకిస్తాన్ వ్యాప్తంగా పర్యటిస్తూ..పీఎం షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. -
lizard in the curry: హాస్టల్ వంటలో బల్లి.. 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత
Students Fall Ill After Eating Hostel food: బల్లి పడిన ఆహారం తిన్న విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో జరిగింది. కూరలో బల్లి పడిన ఆహారం తిన్న హాస్టల్ లోని విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత కళ్లు తిరగడంతో పాటు, వాంతులు బారిన పడ్డారు విద్యార్థినులు. 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కూరలో బల్లి… -
Etela Rajender: తెలంగాణలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.
Etela Rajender Comments On CM KCR: తెలంగాణలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోందని అన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మునుగోడు గడ్డపై ఎగిరేది కాషాయజెండానే అని అన్నారు. ప్రజాసంబంధ పథకాలను కేసీఆర్ ఎప్పుడూ తీసుకురాలేదని.. పవర్ ఓరియెంటెడ్ పాలసీలనే తీసుకువస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ‘దళిత బంధు’ గుర్తుకు వచ్చిందని.. మునుగోడులో గిరిజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ‘గిరిజన బంధు’ ఇస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా దళితబంధు ఇస్తానన్న మూర్ఖుడు… -
Kerala: కేరళలో దృశ్యం సీన్ రిపీట్.. బీజేపీ కార్యకర్త శవాన్ని గోడలో పెట్టి ప్లాస్టరింగ్
BJP Worker Assassination In Kerala: కేరళ రాష్ట్రంలో సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ మూవీ సీన్ రిపీట్ అయింది. దృశ్యం సినిమాలో ఓ శవాన్ని పోలీస్ స్టేషన్ లో ఫ్లోర్ కింద సమాధి చేయడం అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే కేరళలో ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. దృశ్యం మూవీని తలపించే విధంగా బీజేపీ కార్యకర్త మర్డర్ జరిగింది. ఇప్పుడు ఈ కేసు కేరళలో సంచలనంగా మారింది. బీజేపీ కార్యకర్తను దారుణంగా హత్య చేసి గోడలోపెట్టి ప్లాస్టరింగ్ చేశాడు నిందితుడు. -
Pakistan: పాకిస్తాన్లో డెంగ్యూ కలకలం.. ఈ ఏడాది 30 వేలకు పైగా కేసులు
Dengue outbreak In Pakistan: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్.. ప్రస్తుతం రోగాల బారినపడింది. అక్కడ ప్రజలు అనారోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారు. భారీ వరదలు, వర్షాల కారణంగా ఇప్పటికే అక్కడి ప్రజలు అంటువ్యాధులతో సతమతం అవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ దేశం డెంగ్యూ కోరల్లో చిక్కుకుంది. దీనికి తోడు తీవ్ర మందుల కొరతను కూడా ఎదుర్కొంటోంది ఆ దేశం. పాకిస్తాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్ లో గత 24 గంటల్లో 104 డెంగ్యూ కేసులు నమోదు అవ్వడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. -
Swachh Survekshan Awards 2022: ఆరోసారి క్లీన్ సిటీగా ఇండోర్‌కే పట్టం.. టాప్10లో ఏపీ నుంచి మూడు నగరాలు.
Swachh Survekshan Awards 2022: దేశంలో వరసగా ఆరోసారి మధ్యప్రదేశ్ ఇండోర్ పరిశుభ్రమైన నగరంగా తొలిస్థానంలో నిలిచింది. తాజాగా ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డుల్లో ఇండోర్ నగరానికే పట్టం కట్టారు. సూరత్, నవీ ముంబై నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డ్స్ 2022 అవార్డులను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరసగా ఆరోసారి ఇండోర్ నగరంల నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, మహారాష్ట్రలోని నవీ ముంబై నిలిచాయి. గతేడాది మూడో స్థానంలో… -
Bigg boss 6: శ్రీహాన్ ప్రధాన పాత్రలో ‘ఆవారా జిందగి’!
Bigg boss 6: ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 లో యంగ్ అండ్ ఛార్మింగ్ శ్రీహాన్ ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో డీసెంట్ బిహేవియర్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గత సీజన్ లో పాల్గొన్న సిరి హన్మంతు ప్రియుడిగా గుర్తింపు ఉన్న శ్రీహాన్ మంచి నటుడు కూడా. అతను నటించిన ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్ 'ఆవారా జిందగి'. -
V. V. Vinayak: తొలి తెలుగు పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’!
V. V. Vinayak: గోపురం స్టూడియోస్ పతాకంపై కె. బాబురెడ్డి, జి. సతీష్‌కుమార్ నిర్మించిన బాలల చిత్రం 'లిల్లీ'. ఈ మూవీతో శివమ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నేహ లీడ్రోల్లో వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన ఈ చిత్రంలో రాజ్వీర్ ముఖ్య పాత్రను పోషించారు. శనివారం హైదరాబాద్‌లో ‘లిల్లీ’ సినిమా ప్రమోషన్‌ను లాంఛనంగా ప్రారంభించింది చిత్రయూనిట్. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వి. వి. వినాయక్ 'లిల్లీ' సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు సినిమాలోని ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. -
Pocso Court: మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి 142 ఏళ్ల జైలు శిక్ష
Kerala man sentenced to 142 years in jail for POCSO Case: మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తి కేరళలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలోని పత్తినాంతిట్టకు చెందిన 41 ఏళ్ల వ్యక్తికి ఈ శిక్షను విధించింది. పదేళ్ల మైనర్ పిల్లవాడిపై రెండేళ్ల పాటు లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. దీంతో పాటు రూ. 5 లక్షల జరిమానాను విధించింది. నిందితుడు ఒక వేళ రూ.5 లక్షల…
తాజావార్తలు
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!