Toll From Indonesia Earthquake Reaches 252: ఇండోనేషియా భూకంపంలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ భూకంపంలో ఇప్పటి వరకు 252 మంది మరణించారు. మంగళవారం ఇండోనేషియా ప్రభుత్వం మరణాల సంఖ్యను వెల్లడించింది. మరో 31 మంది గల్లంతయ్యారని.. 377 మంది గాయపడ్డారని వెల్లడించింది. భూకంపం వల్ల 7,060 మంది ప్రజలు చెల్లచెదురయ్యారు.
ఇండోనేషియా పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణంలో భూకంపం సంభవించడం వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో భూకంపం రావడం వల్ల ప్రజలు ప్రాణాలు పోయాయి. ప్రస్తుతం శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయి ఉన్నారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది పనిచేస్తోంది. సోమవారం భూకంపం రాజధాని జకర్తాలకు ఆగ్నేయంగా 75 కిలోొమీటర్ల దూరంలో ఉన్న సియాంజూర్ లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
Read Also: Saudi Arabia: 12 మంది తల నరికి, ఉరితీసిన సౌదీ అరేబియా
భూకంపం బారిన పడిని ఇండోనేషియాకు ప్రపంచదేశాలు బాసటగా నిలుస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇండోనేషియాకు అండగా ఉంటామని ప్రకటించారు. ‘‘ఇండోనేషియా భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధాకరం.. బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని.. ఈ దు:ఖ సమయంలో ఇండోనేషియాకు భారత్ అండగా ఉంటుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు బ్రిటన్ ప్రధాని రిషి సునక్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సంతాపం వ్యక్తం చేశారు.
ఇండోనేషియాలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇండోనేషియా సముద్రంలో అగ్నిపర్వతాలు అధికంగా ఉంటాయి. ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని ‘‘ రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా టెక్టానిక్ ప్లేట్ కదలికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ పలకల మధ్య ఘర్షణ, అగ్నిపర్వతాల విస్పోటనం కారణంగా ఇండోనేషియా భూకంపాలు, సునామీల బారిన పడుతుంటుంది.