శాసనసభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీల కోసం గతంలో కేసీఆర్ అనేక పోరాటాలు చేశారు.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి.. తిరిగి తెలంగాణలోనే అడుగు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే.. బీసీ బిల్లు సాధించుడో.. లేకపోతే ఢీల్లీ నుంచి తెలంగాణకు రాను అని అక్కడే జంతర్ మంతర్ లో కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి అని తెలిపారు. ప్రధానమంత్రి […]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గంగుల కమాలకర్ పై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. సభలో గంగుల మాట్లాడుతూ.. మంత్రికి వాస్తవాలు తెలియదు.. నేను అడిగిన వాటికి సీఎం క్లారిటీ ఇవ్వాలి అని అన్నారు. గంగులు వ్యాఖ్యలతో హీట్ పెరిగింది. ఆకారాలు పెద్దగ ఉంటే..అవగాహన ఎక్కువ ఉంటది అనుకోవద్దు అని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. అవగాహన లేదు అంటున్నారు.. ఆయన కంటే […]
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈరోజు అధ్యక్షుడు జి జిన్పింగ్ను కలిశారు. టియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ సమావేశం జరిగింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉత్తర చైనాలోని టియాంజిన్లో జరిగే SCO శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి హాజరవుతారు. ఇద్దరు నాయకుల సమావేశం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు) ప్రారంభమైంది. […]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బీసీలకు రీజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాం.. ఇతర రాష్ట్రాల్లో వచ్చిన అడ్డంకులు తెలంగాణలో రావొద్దన్నదే మా ఆలోచన.. ఆరునూరైనా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులు చేసి పంపితే గవర్నర్, రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టారు.. గత సర్కార్ 50 శాతం రిజర్వేషన్లు […]
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐదు నెలల్లో 30మంది మృతిచెందారు. దీంతో వైద్యారోగ్య శాఖ వరుస మరణాలపై దృష్టి పెట్టింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామంలో పర్యటిస్తున్నారు. ఎపిడిమిక్ బృందంతోపాటు గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన ఎస్.పి.ఎం., మైక్రో బయాలజీ వైద్యబృందం పర్యటిస్తోంది. మృతుల కుటుంబాలనుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మరణాలకు దోమకాటా… లేక మరే ఇతర కారణమా అన్న కోణంలో శాంపిల్స్ సేకరించారు. బ్లడ్ శాంపిల్స్, నీటి పరీక్షల ఫలితాలు […]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ వాడివేడిగా సాగనున్నది. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభ లోపల.. బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ప్రభుత్వ బిల్లులపై చర్చ కొనసాగనున్నది. మొదట పంచాయతీ రాజ్.. మున్సిపల్ సవరణ బిల్లులు.. తర్వాత కాళేశ్వరం కమిషన్ నివేదిక పై చర్చ జరుగనుంది. “కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం – జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమీషన్ నివేదిక” […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెల్లగక్కకుతున్నాడు. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. అమెరికా విధించిన విధంగానే భారతదేశంపై ఆంక్షలు విధించాలని వైట్ హౌస్ యూరోపియన్ దేశాలకు విజ్ఞప్తి చేసిందని సమాచారం. ఈ ఆంక్షలలో యూరప్ భారతదేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును వెంటనే నిలిపివేయాలని ఉందని తెలిసింది. ఆగస్టు 27 నుండి అమెరికా భారతదేశంపై ఇప్పటికే 50 శాతం సుంకాన్ని విధించింది. అయితే, భారతదేశంపై సుంకాలకు సంబంధించి ఏ యూరోపియన్ […]
కరీంనగర్ జిల్లా లో దారుణ హత్య జరిగింది. ఏడు నెలల గర్భిణీ నీ గొంతు కోసి హత్య చేశారు దుండగులు. అయితే హత్యకు ఆస్తి తగాదాలే కారణమని కొడుకే సవతి తల్లి నీ హతమార్చారని స్థానికులు అంటున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు – రేణుక కు ఇద్దరు కుమారులు. అయితే రాములు గత ఏడు సంవత్సరాల క్రితం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తిరుమల అనే మరో […]
NTV Daily Astrology as on 31th August 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
తెలంగాణలో యూరియా కొరతతో అన్నదాతలు పడుతున్న తిప్పలు అన్నీఇన్నీ కావు. యూరియా కోసం రాత్రింబవళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదునుకు పంటలకు యూరియా అందించకపోతే దిగుబడి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ల మేర రైతులు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కోసం వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం ప్రదర్శించారు. క్యూ లైన్లో నిలబడిన రైతులపై మరికల్ ఎస్ ఐ […]