పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. అందుకే యువతీ యువకులు తమ వివాహ వేడుకలను వినూత్నంగా ప్లాన్ చేసుకుని లైఫ్ లో బెస్ట్ మెమోరీస్ గా మలుచుకోవాలని భావిస్తుంటారు. ఇటీవల మ్యారేజ్ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీ ఫంక్షన్స్, స్టేజ్ పర్ఫామెన్స్ ఇలా క్రియేటివ్ గా వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి మ్యారేజ్ వేడుకల్లో కొన్ని సార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక వివాహ వేడుకలో భాగంగా జరిగిన హల్దీ వేడుకలో హైడ్రోజన్ బెలూన్లు పేలిపోయాయి. ఈ ఘటనలో వధూవరులు గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read: I Bomma Ravi : చంచల్ గూడ జైలుకు ఐ బొమ్మ రవి
ఈ వీడియోలో ఆ జంట హైడ్రోజన్ బెలూన్లను పట్టుకుని గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వేడుకలో భాగంగా కలర్ గన్స్ పేల్చుతున్నారు. అయితే, కలర్ గన్స్ లో ఒకటి అనుకోకుండా హైడ్రోజన్ బెలూన్లను తాకింది. దీంతో ఒక్కసారిగా వధూవరుల చేతుల్లో ఉన్న బెలూన్స్ భారీ శబ్ధంతో పేలిపోయాయి. కొన్ని సెకన్లలోనే, అన్ని బెలూన్లు మంటల్లో చిక్కుకుని పేలిపోయాయి. నూతన వధూవరులు భయంతో అక్కడి నుంచి దూరంగా పరుగెత్తారు. ఈ ఘటనలో వధూవరులు గాయపడ్డారు.
Also Read:Deputy CM Pawan Kalyan: ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటన..
పెళ్లికి హాజరైన బంధుమిత్రులు, కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. తాన్యాగా గుర్తించబడిన వధువు ముఖం, వీపుపై గాయాలు కాగా, వరుడు కుషాగ్ర వేళ్లు, వీపుపై గాయాలయ్యాయి. పేలుడులో ఇద్దరికీ జుట్టు కూడా స్వల్పంగా కాలింది. హైడ్రోజన్ బెలూన్ల వాడకం ప్రమాదకరం అని, ఆర్భాటాల కోసం కాకుండా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈవెంట్ ప్లానర్లు, కుటుంబాలను నెటిజన్లు సూచిస్తున్నారు.