Donald Trump: “నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి” నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
- Donald Trump, Benjamin Netanyahu మధ్య విభేదాలు
- ట్రంప్, నెతన్యాహును ఫోన్లో తీవ్రంగా మందలించినట్లు సమాచారం
- నీకు పూర్తిగా పిచ్చి పట్టింది. నేను లేకపోతే నువ్వు ఇప్పటికి జైలులో ఉండేవాడివి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు Donald Trump, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి Benjamin Netanyahu మధ్య విభేదాలు మరింత తీవ్రంగా మారినట్లు తెలుస్తోంది. మీడియా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం, లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలను విస్తరించడంపై ట్రంప్, నెతన్యాహును ఫోన్లో తీవ్రంగా మందలించినట్లు సమాచారం. ఇరాన్‌తో శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో, లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసం ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తున్నారని నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో లెబనాన్‌పై దాడులను నిలిపివేయాలని కోరుతూ ఆయన నెతన్యాహుకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
ఆక్సియోస్ నివేదిక ప్రకారం, ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అమెరికా అధికారి వెల్లడించిన వివరాల మేరకు, ట్రంప్ నెతన్యాహుతో మాట్లాడుతూ, “నీకు పూర్తిగా పిచ్చి పట్టింది. నేను లేకపోతే నువ్వు ఇప్పటికి జైలులో ఉండేవాడివి. నేను నీ రాజకీయ జీవితాన్ని కాపాడుతున్నాను. ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీ చర్యల వల్ల ఇజ్రాయెల్ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటోంది” అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
Also Read
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
- ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
- Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్‌తో చర్చలు.. పక్కా ప్లాన్‌తో రెజిమ్ ఛేంజ్?
ఇదిలా ఉండగా, ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో, నెతన్యాహుతో ఫలవంతమైన చర్చ జరిపినట్లు పేర్కొన్నారు. బీరుట్‌పై ఎలాంటి కొత్త సైనిక చర్యలు చేపట్టబోరని, ఇప్పటికే కదులుతున్న దళాలను వెనక్కి పిలిచినట్లు తెలిపారు.
అలాగే, ఉన్నత స్థాయి ప్రతినిధుల ద్వారా హిజ్బుల్లా నేతలతో కూడా చర్చలు జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ చర్చల అనంతరం పూర్తి స్థాయి కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం, ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై దాడులు చేయదు, హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్‌పై ఎలాంటి దాడులకు పాల్పడదని ట్రంప్ తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?