Huawei Nova 16 Series: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. హువావే నోవా 16 సిరీస్ రిలీజ్
- హువావే కొత్త నోవా 16 సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది
- 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ
- 6.84 అంగుళాల OLED డిస్ప్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువావే తన కొత్త నోవా 16 సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో హువావే నోవా 16 అల్ట్రా, నోవా 16 ప్రో, నోవా 16, నోవా 16z మోడళ్లను పరిచయం చేసింది. శక్తివంతమైన బ్యాటరీ, ప్రీమియం డిజైన్, అధునాతన కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లు మధ్య-ప్రీమియం సెగ్మెంట్లో ఒప్పో రెనో 16, వివో S60 సిరీస్‌లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.
నోవా 16 అల్ట్రా, నోవా 16 ప్రో ఫీచర్లు
హువావే నోవా 16 అల్ట్రా, నోవా 16 ప్రో స్మార్ట్ఫోన్లు 6.84 అంగుళాల OLED డిస్ప్లేతో వస్తున్నాయి. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 2856 x 1320 పిక్సెల్స్ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్లు హార్మొనీ OS 6.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. ఈ రెండు మోడళ్లలో కిరిన్ 9010S ప్రాసెసర్‌ను అమర్చారు. అలాగే 7000mAh భారీ బ్యాటరీతో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. నోవా 16 అల్ట్రా మోడల్లో అదనంగా 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.
Also Read
- Huawei Mate X8: 8.15 ఇంచుల డిస్ప్లే, 16GB RAMతో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Huawei Mate X8 వచ్చేస్తోంది
- Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
- Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై భారత జెండా.. ఇదే నా అసలైన లక్ష్యం: వ్యోమగామి శుభాంశు శుక్లా
- NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
200MP కెమెరాతో ఆకట్టుకునే ఫోటోగ్రఫీ
హువావే నోవా 16 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనితో పాటు 50MP OIS టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ మాక్రో కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. నోవా 16 ప్రోలో కూడా 200MP ప్రధాన కెమెరాతో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్లో కూడా 50MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది.
అదనంగా, ఈ రెండు ఫోన్లు శాటిలైట్ కమ్యూనికేషన్ సపోర్ట్, IP68, IP69 వాటర్-అండ్-డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లతో వస్తున్నాయి. కనెక్టివిటీ కోసం Wi-Fi, బ్లూటూత్ 6.0 వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ధరలు
హువావే నోవా 16 అల్ట్రా ప్రారంభ ధర CNY 4,699 (సుమారు రూ. 66,000)గా నిర్ణయించారు. నోవా 16 ప్రో ప్రారంభ ధర CNY 3,899 (సుమారు రూ. 54,700)గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లు 256GB, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. స్టార్రీ బ్లాక్, స్కై బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
-
Janjatiya Gaurav Diwas: గిరిజనులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌లో ప్రధాని మోడీ విమర్శలు
-
Ruturaj Gaikwad: బ్యాటింగ్‌లో ఫెయిల్.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు.. ఇంకో ఛాన్స్ వచ్చేనా?
-
CM Delhi Tour: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ..!
ట్రెండింగ్
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..