విమాన ప్రయాణికులు మర్చిపోలేని రోజుగా మారింది జూన్ 12(గురువారం). కాసేపటి క్రితం ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ లో కూలిపోయింది. టెకాఫ్ అయిన కాసేపటికే విమానం ప్రమాదానికి గురైంది. 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన వెంటనే కూలిపోయింది. ఆ విమానంలో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) తెలిపింది. అందులో 217 పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు. విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది. పైలట్లు సుమిత్ సబర్వాల్, క్లేవ్ కుందర్ ఉన్నారు.
అయితే ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి గల కారణాన్ని విమానయాన నిపుణుడు సంజయ్ లాజర్ ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. విమానం తక్కువ ఎత్తులో ఎగురుతూ.. పైకి ఎగరడంలో విఫలమైందని ఆయన తెలిపారు. 825 అడుగుల చాలా తక్కువ ఎత్తులో ఉన్న విమానం లిఫ్ట్ సాధించడంలో ఘోర వైఫల్యం జరిగిందని అన్నారు. 8,200 గంటల అనుభవంతో కెప్టెన్ సుమీత్ సభర్వాల్, 1,100 గంటల అనుభవంతో ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ పైలట్ చేసిన విమానం ప్రమాదానికి ముందు ‘మేడే’ కాల్ చేసిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read:Air India Plane Crash: 100 మందికి పైగా మృతి.? టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే సిగ్నల్ లాస్ట్..
విమానయానంలో, “మేడే” అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రెస్ సిగ్నల్, ఇది పైలట్లు అత్యవసర పరిస్థితిని తెలపడానికి ఉపయోగిస్తారు . “నాకు సహాయం చేయి” అనే అర్థం వచ్చే ఫ్రెంచ్ పదబంధం “మైడర్” నుంచి ఉద్భవించింది. ఇది రేడియో ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లేదా సమీపంలోని ఇతర విమానాలకు ప్రసారం చేయబడుతుంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టారు.